BIG BREAKING: చెక్కరపై నిషేధం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణం ఇదే?

దేశీయంగా చక్కెర ధరలను అదుపులో ఉంచడంతో పాటు, స్థానికంగా తగినంత నిల్వలు ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర ఎగుమతులను తక్షణమే నిషేధిస్తూ (Prohibited) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
FotoJet - 2026-05-14T121850.593

Ban on sugar.. Modi government's sensational decision

Sugar Exports : దేశీయంగా చక్కెర ధరలను అదుపులో ఉంచడంతో పాటు, స్థానికంగా తగినంత నిల్వలు ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర ఎగుమతులను తక్షణమే నిషేధిస్తూ (Prohibited) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త నోటిఫికేషన్ ద్వారా ముడి చక్కెర (Raw Sugar), తెల్ల చక్కెర (White Sugar) మరియు రిఫైండ్ చక్కెర ఎగుమతులపై పూర్తి ఆంక్షలు విధించారు. ఒకవేళ సెప్టెంబర్ 30 తర్వాత ఈ గడువును పొడిగించకపోతే, చక్కెర ఎగుమతులు మళ్లీ పాత విధానం ప్రకారం "పరిమిత" (Restricted) కేటగిరీలోకి మారుతాయని ప్రభుత్వం పేర్కొంది.

అయితే, ఈ నిషేధం నుండి కొన్ని రకాల ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ (EU), అమెరికా (US) దేశాలకు CXL, TRQ కోటాల కింద జరిగే రవాణాకు ఈ నిషేధం వర్తించదు. అలాగే, అడ్వాన్స్ అథరైజేషన్ స్కీమ్ (AAS) కింద జరిగే ఎగుమతులతో పాటు, ఇతర దేశాల ఆహార భద్రత అవసరాల కోసం ప్రభుత్వాల మధ్య జరిగే చక్కెర సరఫరాను యథాతథంగా కొనసాగిస్తారు. వీటితో పాటు, నోటిఫికేషన్ రాకముందే ఎగుమతి ప్రక్రియలో ఉన్న సరుకులకు కొన్ని షరతులతో అనుమతి ఇచ్చారు. నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందే బస్సు/నౌకల్లో లోడింగ్ ప్రారంభమైనా, షిప్పింగ్ బిల్లు దాఖలై భారతీయ రేవుల్లో నౌకలు లంగరు వేసినా లేదా కస్టమ్స్ అధికారులకు సరుకును అప్పగించినా ఆయా ఎగుమతులకు ఎలాంటి ఆటంకం ఉండదు.

ఈ నిర్ణయం వెనుక దేశంలో చక్కెర ఉత్పత్తి తగ్గుతుందనే ఆందోళనలు ప్రధాన కారణంగా ఉన్నాయి. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం.. దేశంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి రాష్ట్రాలలో చెరకు దిగుబడి తగ్గడం వల్ల, వరుసగా రెండో ఏడాది కూడా చక్కెర ఉత్పత్తి దేశీయ వినియోగం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు రాబోయే వర్షాకాలంపై 'ఎల్ నినో' (El Niño) ప్రభావం చూపే అవకాశం ఉందన్న భయాలు కూడా వచ్చే సీజన్ ఉత్పత్తిపై ఆందోళనలను పెంచాయి. బ్రెజిల్ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఎగుమతి దేశాలలో ఒకటైన భారతదేశం, అంతకుముందు మిల్లులకు 15.9 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను ఎగుమతి చేయడానికి అనుమతించింది. ఇందులో వ్యాపారులు ఇప్పటికే 8 లక్షల టన్నులకు పైగా ఒప్పందాలు చేసుకోగా, 6 లక్షల టన్నులకు పైగా చక్కెర ఇప్పటికే విదేశాలకు రవాణా చేయబడింది.

ఫిబ్రవరిలో ప్రభుత్వం అదనపు ఎగుమతి కోటాలను కేటాయించడంతో వ్యాపారులు పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారని, ఇప్పుడు హఠాత్తుగా నిషేధం విధించడంతో ఆ ఆర్డర్లను పూర్తి చేయడం వ్యాపారులకు పెద్ద తలనొప్పిగా మారుతుందని ముంబైకి చెందిన ఒక అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధి తెలిపారు. భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం ప్రపంచ మార్కెట్‌పై తక్షణమే కనిపించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే న్యూయార్క్ ముడి చక్కెర ఫ్యూచర్స్ ధరలు 2 శాతానికి పైగా పెరగ్గా, లండన్ వైట్ షుగర్ ఫ్యూచర్స్ ధరలు ఏకంగా 3 శాతం మేర జంప్ అయ్యాయి.

Advertisment
తాజా కథనాలు