చంపేస్తామంటూ.. బాబా సిద్దిఖీ కుమారుడికి బెదిరింపులు బాబా సిద్ధిఖీ కుమారుడు జీశాన్‌కి చంపేస్తామంటే బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని దుండగులు కార్యాలయానికి కాల్ చేసి జీశాన్‌ను చంపేస్తామంటూ బెదిరించనట్లు తెలుస్తోంది. By Kusuma 29 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్ధిఖీ ఇటీవల హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎలాంటి బెదిరింపులు లేకుండా అతను హత్యకు గురయ్యారు. అయితే అతని కుమారుడు అయిన ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీకి తాజాగా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. సిద్ధిఖీ హత్యకు గురైన తర్వాత తన కుమారుడుకి తప్పకుండా బెదిరింపు కాల్స్ వస్తాయని ముందే భావించారు. అనుకున్నట్లుగానే జీశాన్‌కి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ ఎమ్మెల్యేతో పాటు బాలీవుడ్ హీరో.. ముంబాయిలో ఉన్న జీశాన్ కార్యాలయానికి గుర్తు తెలియని ఒక నంబర్ నుంచి కాల్ వచ్చింది. జీశాన్‌ను చంపేస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఒకవేళ ఇవ్వకపోతే జీశాన్‌తో పాటు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను కూడా చంపేస్తామని బెదిరించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాజాగా ఓ వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఇది కూడా చూడండి: వీధిన పడ్డ ఉద్యోగులు.. రెచ్చిపోయిన సోమిరెడ్డి..! ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ ఫ్రెండ్.. బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. సిద్ధిఖీకి ఎలాంటి బెదిరింపులు రాలేదు. కానీ హత్యకు గురయ్యారు. ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలోనే అనేక సార్లు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించింది. ఇటీవలే సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కూడా జరిపారు. ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ క్లోజ్‌గా ఉండడమే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. 1998లో కృష్ణ జింకలను వెంటాడినట్టు సల్మాన్ ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. బిష్ణోయ్ తెగకు ఈ కృష్ణ జింకలు అత్యంత పవిత్రమైనవి. అందుకే గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ వంటి క్రిమినల్స్.. సల్మాన్‌పై పగబట్టారు. ఈ ఇద్దరు క్రిమినల్స్ కొంతకాలంగా సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరిస్తూ వస్తున్నారు. ఇది కూడా చూడండి: ఆలయంలో పేలిన బాణాసంచా.. 150 మందికి పైగా గాయాలు #baba siddique మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి