మోదీ జాతకంలో యుద్ధం.. పాకిస్తాన్‌పై ఇండియా ఆ రోజు దాడి చేయనుందా?

మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆ యుద్ధం సెగలు భారత్, పాకిస్తాన్‌కు కూడా అంటుకుంటాయని జ్యోతిష్కురాలు చెప్పుకొచ్చారు. ఆమె ఇండో- పాక్ సంబంధాలపై వేసిన అంచనాలు ఆన్‌లైన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

New Update
_India is attacking

మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆ యుద్ధం సెగలు భారత్, పాకిస్తాన్‌కు కూడా అంటుకుంటాయని జ్యోతిష్కురాలు చెప్పుకొచ్చారు. ఆమె ఇండో- పాక్ సంబంధాలపై వేసిన అంచనాలు ఆన్‌లైన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె గ్రహాల కదలికు బట్టి 2026 మార్చి 21న పాకిస్తాన్‌పై భారత్ దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆమె తన వీడియోలో జ్యోతిష్య శాస్త్ర లెక్కలను వివరిస్తూ.. ఆ రోజున కుజ, రాహు, బుధ గ్రహాల కలయిక కారణంగా అంగారక యోగం, ఖపర్ యోగం ఏర్పడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా 4వ స్థానంలో ఈ గ్రహాలు ఉండటం, 5వ స్థానంలో సూర్యుడు, శని, నెప్ట్యూన్, శుక్రుడు కలిసి ఉండటంతో యుద్ధ వాతావరణం నెలకొంటుందని ఆమె విశ్లేషించారు.

"మార్చి 19 నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. మార్చి 21న రిక్త తిథి, జ్యేష్ట నక్షత్రం ఉన్నాయి. ఇవన్నీ అత్యంత శక్తివంతమైన, క్రూరమైన గ్రహాల స్థితిని సూచిస్తున్నాయి. ఈ తేదీ చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది" అని ఆమె పేర్కొన్నారు. యుద్ధం సంభవిస్తే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు ముందుస్తుగా సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. కనీసం 1 నుండి 2 నెలలకు సరిపడా ఆహార సామాగ్రి (రేషన్) నిల్వ చేసుకోవాలని. అత్యవసర మందులు, నగదు, సోలార్ ఛార్జర్లను సిద్ధం చేసుకోవాలని కోరారు. పాకిస్తాన్‌ను ఒకవైపు నుండి ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు నుండి భారత్ చుట్టుముట్టే అవకాశం ఉందని ఆమె జోస్యం చెప్పారు.

మోదీ జాతకంతో లింక్?
ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగత జాతకంలో మంగళ మహాదశ నడుస్తుందని, దేశ జాతకంలో రాహు అంతర్దశ అంగారక యోగాన్ని మరింత యాక్టివేట్ చేస్తుందని ఆమె వివరించారు. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తరహాలోనే, ఈసారి కూడా అర్ధరాత్రి వేళ కీలక నిర్ణయాలు ఉండవచ్చని ఆమె అంచనా వేశారు. జ్యోతిష్య అంచనాలు కేవలం గ్రహ గతులపై ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయంగా లేదా అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు.

Advertisment
తాజా కథనాలు