Delhi: ఎయిర్‌ ట్రైన్‌..దేశంలోనే తొలిసారి!

ఇప్పటి వరకు దేశంలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, వందేభారత్‌, వందే మెట్రో ఇలా రకరకాల రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈ లిస్ట్‌ లోకి ఎయిర్ ట్రైన్ చేరనుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఎయిర్ ట్రైన్ కోసం.. ఇప్పటికే వివిధ టెర్మినల్స్ రెడీ అవుతున్నాయి.

New Update

Air Train: భారత్ లో బలమైన రైల్వే నెట్‌వర్క్ ఉంది. ప్రతిరోజూ దాదాపు రెండు నుంచి రెండున్నర కోట్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తుంటారు. సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, మెయిల్, ప్యాసింజర్, వందేభారత్‌, వందే మెట్రో ఇలా రకరకాల రైళ్లు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో, ఇప్పుడు ప్రయాణికుల కోసం ఏకంగా.. ఎయిర్ ట్రైన్ అందుబాటులోకి రానుంది.

Also Read: నటుడు మోహన్‌ రాజ్‌ కన్నుమూత!

చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉండే ఈ ఎయిర్ ట్రైన్.. దేశంలో ఇదే మొదటి. ఈ రైలు గాల్లోనే పరుగులు పెడుతుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఎయిర్ ట్రైన్ కోసం.. ఇప్పటికే వివిధ టెర్మినల్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్ట్ 2027 చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. దీనికి రూ.2000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

Also Read: మంత్రాల భయంతో మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిన గ్రామస్థులు.!

Advertisment
Advertisment
తాజా కథనాలు