/rtv/media/media_files/2025/04/09/V64Fmxrr2YerY3SYTfEA.jpg)
Air India
ముంబై నుండి బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో గాల్లో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుడివైపు ఇంజిన్ మొరాయించడంతో పైలట్ అత్యవసరంగా విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
An Air India flight was forced to turn back just minutes after takeoff after passengers reported a loud bang and sparks from one of the engines.
— Flightdrama (@flightdrama) April 9, 2026
Flight AI2812, operated by an Airbus A320neo, departed Mumbai shortly after 2:15 a.m. bound for Bengaluru before the crew declared a… pic.twitter.com/YDmFzLVwnU
ఎయిర్ ఇండియా విమానం AI-2812 మధ్యాహ్నం 2.14 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అయితే విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. టేకాఫ్ సమయంలో వింత శబ్దాలు వచ్చాయని, మంటలు కూడా కనిపించాయని కొంతమంది ప్రయాణికులు తెలిపారు. పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై పాన్-పాన్ కాల్ చేశారు. విమానయాన భాషలో పాన్-పాన్ అంటే.. ప్రాణాపాయం లేనప్పటికీ, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి ప్రత్యేక ప్రాధాన్యత కోరడానికి వాడే సంకేతం.
ముంబైలో క్షేమంగా ల్యాండ్
విమానం బయలుదేరిన 20 నిమిషాల వ్యవధిలోనే ముంబైలో క్షేమంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరినీ కిందకు దించి, ఇంజిన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీనిపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ.. కేవలం ముందుజాగ్రత్త చర్యగా, అనుమానిత సాంకేతిక లోపం కారణంగానే విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు వెల్లడించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ, వారిని గమ్యస్థానానికి చేర్చడానికి సాయంత్రం 4.45 గంటలకు మరో ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు. సుమారు రెండున్నర గంటల ఆలస్యం తర్వాత ప్రయాణికులు వేరే విమానంలో బెంగళూరుకు పయనమయ్యారు.
Follow Us