/rtv/media/media_files/2026/05/04/vijay-trisha-2026-05-04-13-14-44.jpg)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) సృష్టిస్తున్న ప్రభంజనం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా విజయ్ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతుండటంతో ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది. ఇప్పటికే టీవీకే 100 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
త్రిష తన 43వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అక్కడి నుంచి నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. తెల్లటి కారులో వచ్చిన ఆమె, కెమెరాలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ లోపలికి వెళ్లారు.
విజయ్-త్రిష జోడీ వెండితెరపై ఎంతటి సెన్సేషనో తెలిసిందే. ఇప్పుడు విజయ్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన రోజున త్రిష పక్కన ఉండటం అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. విజయ్ రాజకీయ విజయంతో పాటు ఆయన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.2025 డిసెంబర్‌లో విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 'లియో' సినిమా తర్వాత మరియు ఇటీవల జరిగిన వివాహ వేడుకల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ ప్రచారం మరింత పెరిగింది. ఇప్పుడు త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లడం ఈ చర్చలకు మరింత ఆజ్యం పోసింది.
గతంలో వీరిద్దరూ కలిసి అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించడం (గిల్లి, తిరుపాచి, కురువి, లియో) తో వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే.
#WATCH | Actor Trisha Krishnan arrives at the residence of TVK chief Vijay, in Chennai.
— Hindustan Times (@htTweets) May 4, 2026
Download the HT App to watch the most accurate election results: https://t.co/adKgBHtrrZ
Track LIVE: https://t.co/5vNWnGzXiQ#Vijay#TVK#TamilNaduElections#ElectionResultsWithHTpic.twitter.com/dNZUZ8nnCS
Follow Us