Chennai: ప్రైవేట్ స్కూళ్లో గ్యాస్ లీకేజీ...30 మంది విద్యార్థులు..! చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూళ్లో గ్యాస్ లీకేజీ అయ్యింది.పాఠశాల మూడో అంతస్తులోని 8-10 తరగతి విద్యార్థులు దాదాపుగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. By Bhavana 26 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Chennai: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూళ్లో గ్యాస్ లీకేజీ అయ్యింది. దీని వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని తిరువొత్తియార్ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన అనేక మంది విద్యార్థులు శుక్రవారం అనుమానాస్పద గ్యాస్ లీక్ కారణంగా శ్వాస తీసుకోవడం , తల తిరగడం, వికారం వంటి లక్షణాలతో సుమారు 30 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. Also Read: రతన్ టాటాతో చివర వరకూ ఉన్న టీటో..వీలునామాలో పేరు ఈ ఘటనలో.. ప్రధానంగా పాఠశాల మూడో అంతస్తులోని 8-10 తరగతి విద్యార్థులే ఎక్కువగా అస్వస్థతకు గురైనట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపుగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే వారందరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. Also Read: ఫలించిన కానిస్టేబుల్ భార్యల కృషి.. సెలవుల రద్దు నిర్ణయం నిలిపివేత ఏదో ఘాటైన వాసన... ఇప్పుడు వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. ముందు విద్యార్థులు ఏదో ఘాటైన వాసన వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఏర్పడినట్లు చెప్పారు. దీంతో వెంటనే వైద్య సాయం కోసం పాఠశాల అధికారులు చర్యలు తీసుకున్నారు. Also Read: రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు ముందు ఈ ఘాటైన వాసన కెమెస్ట్రీ ల్యాబ్ నుంచి వస్తొందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘాటైన వాననకు గల కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. దీని గురించి తెలుసుకునేందుకు పోలీసులు పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. Also Read: నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్.. విదేశాల్లో భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం బాధిత విద్యార్థుల పరిస్థితిని అంచనా వేయడానికి సీనియర్ పోలీస్ అధికారులు ప్రస్తుతం పాఠశాల మైదానాలను, ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రత కోసం అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు. Also Read: గుడ్‌న్యూస్.. దీపావళి పండగకు 6 రోజులు సెలవులు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి