🔴Assembly Election Results 2026 Live: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. మినిట్ టు మినిట్ ఎక్స్ క్లూజివ్ లైవ్ అప్‌డేట్స్..!

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాయి పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో, ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.

author-image
By Lok Prakash
New Update
Assembly Election Results 2026 Live

Assembly Election Results 2026 Live

2026 Assembly Election Results Live:

2026 Assembly Election Results Live: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా ఉత్కంఠగా మారాయి. అన్ని ప్రధాన పార్టీలు గట్టిగా పోటీ పడటంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అన్నది తెలుసుకోవాలని అందరూ ఎదురుచూస్తున్నారు.

బీజేపీ, తృణమూల్, కాంగ్రెస్, డీఎంకే, టీవీకే వంటి పార్టీలు ప్రచారంలో బాగా శ్రమించాయి. ఓటర్లు తమ ఓట్లతో ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు. ఇప్పుడు కౌంటింగ్, ఫలితాల ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది.

ఈ రోజు ఉదయం 8 గంటలకు బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. దాని తర్వాత ఈవీఎంలలో ఉన్న ఓట్ల కౌంటింగ్ మొదలవుతుంది.

ఫలితాలు ఒక్కసారిగా రావు. రౌండ్ రౌండ్‌గా ఆధిక్యాలు మారుతూ ఫలితాలు ఉంటాయి. అందుకే మధ్యాహ్నం వరకూ ఎవరు ముందున్నారు అన్నది మారే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం స్పష్టమైన ఫలితాలు బయటపడతాయి. మొత్తం 824 సీట్ల ఫలితాలు సాయంత్రానికి పూర్తయ్యే అవకాశం ఉంది.

అయితే ప్రజలు ఉదయం నుంచే ఆధిక్యాలను గమనిస్తూ ఎవరు గెలుస్తారో అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ ఫలితాల కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. గెలుపు వార్తలు వచ్చాక వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలపై తాజా సమాచారం కోసం మా లైవ్ అప్‌డేట్స్‌ను ఫాలో అవ్వండి.

  • May 04, 2026 21:50 IST

    బెంగాల్ సీఎస్‌ సంచలన ఆదేశాలు.. ఒక్క ఫైల్‌ బయటికి వెళ్లినా కఠిన చర్యలు

    మొదటిసారిగా బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రానుండటంతో ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైళ్లు, కీలక పత్రాల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేశారు. 

    West Bengal
    West Bengal



  • May 04, 2026 21:36 IST

    విజయ్ ని అభినందిస్తూ ట్వీట్ చేసిన కమల్ హాసన్

    "తమ మొట్టమొదటి ఎన్నికలోనే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, గొప్ప విజయాన్ని సాధించిన తమిళగ వెట్రి కజగం నాయకుడు తిరు. విజయ్ గారికి, వారి పార్టీ సభ్యులకు నా అభినందనలు. వారి ప్రజా సేవ వర్ధిల్లాలని నా శుభాకాంక్షలు"…. కమల్ హాసన్



  • May 04, 2026 21:36 IST

    భవానీపూర్‌లో మమతా బెనర్జీ పరాజయం

    > బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో మమతా ఓటమి
    > 10,994 ఓట్లతో సువేందు విజయం
    > భవానీపూర్‌లో మాత్రమే నామినేషన్‌ వేసిన మమతా



  • May 04, 2026 21:12 IST

    సీఎంగా విజయ్‌.. ప్రభుత్వ ఏర్పాటుకు సపోర్ట్‌ ఇచ్చే పార్టీలు ఇవే !

    తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాల్లో ముందంజలో ఉండి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ 118కి మాత్రం స్వల్ప దూరంలో ఉండిపోయింది. దీంతో విజయ్‌తో ఏ పార్టీలు కలుస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

    TVK Vijay
    TVK Vijay



  • May 04, 2026 19:56 IST

    'నాన్న మనం గెలిచాం'.. మాజీ సీఎం కొడుకు ఎమోషనల్ పోస్ట్‌

    కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో గెలిచింది. పూతుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దివంగత సీఎం ఊమెన్ చాందీ కొడుకు చాందీ ఊమెన్ భారీ మెజార్టీతో గెలిచారు.

    Chandy Oommen
    Chandy Oommen



  • May 04, 2026 19:02 IST

    విజయ్ సంచలన గెలుపు.. నెట్టింట వైరల్ అవుతున్న జ్యోతిష్యుడు.. ఎవరీ రాధన్ పండిట్?

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తలపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ పేరు వైరల్ అవుతోంది.

    Radhan Pandit
    Radhan Pandit



  • May 04, 2026 19:01 IST

    ఆటో డ్రైవర్ To అసెంబ్లీ.. ఇది మామా విక్టరీ అంటే..!

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుంది. ఓ సామాన్య ఆటో డ్రైవర్ రాజకీయ ఉద్ధండులను మట్టికరిపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

    Chennai auto driver beats DMK, AIADMK heavyweights, wins Royapuram for TVK Party
    Chennai auto driver beats DMK, AIADMK heavyweights, wins Royapuram for TVK Party



  • May 04, 2026 19:00 IST

    ఆ విషయంలో పవన్, KCR ఫెయిల్.. విజయ్ సక్సెస్.. ఇంట్రెస్టింగ్ న్యూస్!

    తమిళనాడు ఎన్నికల్లో టీఎంకే విజయ్ సంచలనం సృష్టించారు. ఆయన పెరంబూర్‌, తిరుచ్చి ఈస్ట్‌ నుంచి పోటీ చేసిన సంగతి తెలసిందే. ఈ రెండు స్థానాల్లో కూడా విజయ్ విజయం సాధించారు.

    Pawan kalyan, KCR and Vijay
    Pawan kalyan, KCR and Vijay



  • May 04, 2026 18:59 IST

    15 ఏళ్ల దీదీ పాలనకు ముగింపు.. బీజేపీకి విజయానికి దారితీసిన 10 ప్రధాన కారణాలు ఇవే !

    టీఎంసీ పార్టీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి మాత్రం బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీని అధికారం నుంచి తప్పింది.. బీజేపీ విజయానికి కారణమైన పలు కీలక అంశాలు తెలుసుకుందాం. 

    10 reasons behind BJP victory in West bengal
    10 reasons behind BJP victory in West bengal



  • May 04, 2026 18:59 IST

    సినిమాల నుంచి సీఎం వరకు.. విజయ్ ఫ్యామిలీ సంచలన ట్రాక్ రికార్డ్ తెలుసా?

    టీవీకే పార్టీ అధినేత విజయ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలుపొందడమే కాకుండా.. మొత్తం 108 స్థానాలతో ఆధిక్యంలో ఉన్నారు. హీరోగా సినిమాల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన విజయ్‌కు ఫ్యామిలీ పరంగా రాజకీయ బ్యాగ్రౌండ్ ఉందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

    TVK vijay family
    TVK vijay family



  • May 04, 2026 18:58 IST

    విజయ్ గ్రాండ్ విక్టరీపై స్పందించిన పవన్.. ఏమన్నారో తెలుసా?

    ఓటర్ల చైతన్యం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలలో మరోసారి స్పష్టంగా కనిపిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. నేడు విడుదల అవుతున్న ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు.

    Pawan Vijay



  • May 04, 2026 18:34 IST

    ప్రధాని మోడీ

    బెంగాల్‌లో కమలం వికసించింది. బెంగాల్‌ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఇది బెంగాల్‌ ప్రజల విజయం. బీజేపీని గెలిపించిన ప్రతికార్యకర్తకు ధన్యవాదాలు.



  • May 04, 2026 18:11 IST

    తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి విజయం

    > ఎడప్పాడిలో 90 వేలకు పైగా ఓట్లతో పళనిస్వామి గెలుపు



  • May 04, 2026 18:10 IST

    కేరళలో యూడీఎఫ్‌ విజయం

    > కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 102 సీట్లలో గెలుపు

    > స్పష్టమైన మెజార్టీ

    > ఎల్డీఎఫ్‌ 35 స్థానాల్లో గెలుపు 

    > బీజేపీ 3 స్థానాల్లో గెలుపు



  • May 04, 2026 18:04 IST

    కేరళంలోని ధర్మదంలో పినరయి విజయన్‌ గెలుపు

    > తమిళనాడు అన్నా డీఎంకే అభ్యర్థి డీఎంకే అభ్యర్థి ఉదయనిధి స్టాలిన్‌ గెలుపు
    > బెంగాల్‌లో 202 స్థానాల్లో బీజేపీ  ఆధిక్యం
    > 85 స్థానాల్లో టీఎంసీ లీడింగ్‌
    > రెండేసి స్థానాల్లో కాంగ్రెస్‌, లెప్ట్‌ పార్టీలు ఆధిక్యం



  • May 04, 2026 17:50 IST

    ఈ వీడియో ట్రెండ్ అయినప్పుడే అర్థం చేసుకోవాల్సింది



  • May 04, 2026 16:37 IST

    తమిళనాడులో కొత్త ట్రెండ్ షురూ



  • May 04, 2026 16:27 IST

    శిష్యుడి చేతిలో గురువు ఓటమి.. CM స్టాలిన్ ను ఓడించిన VS బాబు బ్యాగ్రౌండ్ ఇదే!

    గతంలో వీఎస్ బాబు కూడా డీఎంకే పార్టీలోనే ఉన్నారు. 2006లో జరిగిన  పురసవాక్కం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.  ఆ ఎన్నికలలో ఏఐఏడీఎంకే అభ్యర్థిపై 90,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

    cm stalin



  • May 04, 2026 16:26 IST

    సింహం సింగిల్‌గా.. KCR, జగన్, విజయ్ లో ఉన్న కామన్ పాయింట్ ఇదే!

    ఏ పార్టీతో పొత్తు లేకుండా విజయ్‌ సింగిల్‌గా బరిలోకి దిగారు. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఇంతటీ భారీ స్థాయిలో సీట్లు గెలుచుకోనుండటం, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    KCR, Jagan and Vijay
    KCR, Jagan and Vijay



  • May 04, 2026 16:25 IST

    సీఎం స్టాలిన్ ఓటమి!

    తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొలత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి దాదాపుగా ఖాయమైంది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం

    stalin



  • May 04, 2026 16:25 IST

    విజయ్ కేబినెట్‌లోకి త్రిష..కీలకమైన శాఖ.. ఎంటో తెలుసా?

    తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన వార్త ఒకటి తెగ హల్ చల్ చేస్తోంది. ఎన్నికల ఫలితాల్లో TVK ప్రభంజనం సృష్టిస్తుండటంతో, విజయ్ ఏర్పాటు చేయబోయే కేబినెట్‌లో హీరోయిన్ త్రిష కూడా ఉండబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

    trisha vijay cabinet



  • May 04, 2026 16:19 IST

    బెంగాల్‌ పలితాలపై మమతా బెనర్జీ స్పందన

    > అంతా ఈసీని చేసింది: మమతా బెనర్జీ

    > SIR పేరుతో ఓట్లను దొంగిలించారు

    > మా ఓటమికి ఈసీనే కారణం



  • May 04, 2026 16:05 IST

    ఐదు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    నాలుగు రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ
    తమిళనాడులో మెజారిటీ మార్క్‌కు చేరువలో విజయ్
    అస్సాం, పుదుచ్చేరిలో కొనసాగనున్న ప్రస్తుత సీఎంలు
    బెంగాల్, కేరళం ముఖ్యమంత్రులపై దేశవ్యాప్తంగా చర్చ
    కేరళం ముఖ్యమంత్రి రేసులో..
    వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల, కేసీ వేణుగోపాల్
    కేరళం సీఎం అభ్యర్థిపై శశిథరూర్ ఆసక్తికర కామెంట్లు
    గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తాం
    సీఎంను అధిష్ఠానమే నిర్ణయిస్తుంది-శశిథరూర్



  • May 04, 2026 15:59 IST

    సెకండ్‌ ప్లేస్‌కు వచ్చిన స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే

    > క్రమేపీ పుంజుకున్న డీఎంకే
    > మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకిన డీఎంకే
    > ప్రస్తుతం 74 సీట్ల ఆధిక్యంలో డీఎంకే
    > 52 సీట్ల ఆధిక్యంతో మూడో స్థానానికి పడిపోయిన ఏఐఏడీఎంకే 
    > మూడు గంటల వరకు ఏఐఏడీఎంకే రెండోస్థానంలో కొనసాగగా, డీఎంకే మూడో స్థానంలో ఉంది
    > ఆపై అనూహ్యంగా పుంజుకుని రెండోస్థానానికి  వచ్చిన డీఎంకే



  • May 04, 2026 15:58 IST

    టీవీకే పూర్తిస్థాయి మెజార్టీ సాధించడం అసాధ్యం.

    తమిళనాడులో హంగ్‌కే అవకాశం. టీవీకే ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో 3 వేల లోపు మెజార్టీతో 11 సీట్లు, 2 వేల లోపు మెజార్టీతో 12 సీట్లు, 500 లోపు మెజార్టీతో 8 స్థానాలు.



  • May 04, 2026 15:48 IST

    కళత్తూర్‌ నియోజకవర్గంలో స్టాలిన్‌ వెనుకంజ

    > టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు కంటే 7 వేల ఓట్ల వెనకబడ్డ స్టాలిన్‌
    > 1996 నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్టాలిన్‌
    > చెపాక్‌లో స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి ముందంజ



  • May 04, 2026 15:40 IST

    ముందే చెప్పాడు, కొట్టాడు.. అది నా కొడుకంటే : TVK విక్టరీపై విజయ్ తండ్రి ఎమోషనల్!

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధించిన చారిత్రాత్మక విజయంపై ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ స్పందించారు. తన కుమారుడి నమ్మకం, తెగువపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    vijay father



  • May 04, 2026 15:31 IST

    సీఎం పదవికి రాజీనామా చేసేందుకు స్టాలిన్‌ సిద్ధం!

    > సీఎం పదవికి రాజీనామా చేయనున్న స్టాలిన్‌
    > కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న సీఎం స్టాలిన్‌



  • May 04, 2026 15:09 IST

    విజయ్ గెలుస్తాడని చెప్పిన ఒకే ఒక సర్వే.. Axis My India సంచలన ట్రాక్ రికార్డ్ ఇదే!

    తమిళనాడు శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంతో విజయ్ TVK మొదటి స్థానంలో, 78 స్థానాల్లో ఆధిక్యంతో ఏఐఏడీఎంకే రెండవ స్థానంలో, 52 స్థానాల్లో ఆధిక్యంతో డీఎంకే మూడవ స్థానంలో ఉన్నాయి.

    vijay axis my india



  • May 04, 2026 15:09 IST

    తమిళనాడు సీఎంగా విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు మూడు దారులు

    టీవీకే పార్టీ 110 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. AIADMK 64 స్థానాల్లో మెజార్టీలో ఉండగా.. DMK 60 స్థానాల్లో లీడింగ్‌లో ఉంటూ మూడో స్థానానికి పడిపోయింది. మొత్తానికి టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

    TVK Vijay has Three Options to form govt in Tamilnadu
    TVK Vijay has Three Options to form govt in Tamilnadu



  • May 04, 2026 15:08 IST

    తమిళనాడు ఎన్నికలు... ట్రెండింగ్‌లో జననాయగన్‌ డైలాగులు..త్రిష బర్త్‌డే

    తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ విజయ్ రాజకీయ విజయంతో పాటు, ఆయన సినిమా ‘జననాయగన్‌’ ,నటి త్రిష పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి.  

    FotoJet - 2026-05-04T140551.589



  • May 04, 2026 15:08 IST

    అప్పుడు జగన్‌.. ఇప్పుడు మమతా.. అదే తప్పు.. అదే ఫలితం

    పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. మూడుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన టీఎంసీ పార్టీ ఈసారి వెనుకంజలో ఉంది. 97 స్థానాల్లో టీఎంసీ లీడింగ్‌లో ఉండగా బీజేపీ 191 స్థానాల్లో లీడింగ్‌ ఉంటూ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది.

    Jagan and Mamata Benarjee
    Jagan and Mamata Benarjee



  • May 04, 2026 15:07 IST

    విజయ్ డ్రైవర్ కొడుకు సంచలనం.. భారీగా ఆధిక్యం!

    తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో TVK చీఫ్, దళపతి విజయ్ తన కారు డ్రైవర్ కొడుకును ఎన్నికల బరిలో నిలబెట్టగా, అక్కడ ఆ యువకుడు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నాడు.

    vijay driver son



  • May 04, 2026 15:06 IST

    Political Stroke : అక్కడ కొడుకు.. ఇక్కడ కూతురు... తండ్రులకు వారసుల స్ట్రోక్

    తమిళనాడులో డీఎంకే పార్టీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ కేవలం ఆయన కొడుకు ఉదయనిధి కారణాంగానే ఆ పార్టీ అపజయం పాలయిందనే చర్చ సాగుతోంది. అలాగే తెలంగాణలోనూ బీఆర్‌ఎస్‌ ఓటమికి కేసీఆర్‌ కూతురు కవిత కారణమని ప్రచారం సాగుతోంది.

    FotoJet - 2026-05-04T134500.464



  • May 04, 2026 13:27 IST

    కేరళలో దూసుకుపోతున్న యూడీఎఫ్ 

    కేరళ అసెంబ్లీ ఎన్నికల తాజా లెక్కల ప్రకారం యూడీఎఫ్ కూటమి భారీ ఆధిక్యంతో ముందంజలో ఉంది. ప్రస్తుతం సుమారు 100 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

    మరోవైపు ఎల్డీఎఫ్ కూటమి 37 సీట్లలో, ఎన్డీఏ కూటమి 3 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నాయి.



  • May 04, 2026 13:10 IST

    BREAKING: విజయ్ ఇంటికి త్రిష



  • May 04, 2026 12:58 IST

    విజయ్ కుటుంబంలో విజిల్‌ సంబరాలు

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ గుర్తు ‘విజిల్’ ఊదుతూ విజయ్ కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకుంటున్నారు.



  • May 04, 2026 12:47 IST

    Election Results 2026: ఎన్నికల ఫలితాలపై బీజేపీ రెస్పాన్స్ ఇదే!

    తాజా ఎన్నికల ఫలితాలపై.. బీజేపీ తనదైన శైలిలో స్పందించింది. కాళికా మాత ముందు ప్రధాని మోదీ దర్శనం చేసుకుంటున్న దృశ్యాన్ని ట్వీట్ చేస్తూ, కాళీ మాత, బెంగాల్ ప్రజల ఆశీర్వాదాలు లభించాయని తెలిపింది.



  • May 04, 2026 12:24 IST

    ఎన్డీయే విజయం మోదీ నాయకత్వంపై నమ్మకాన్ని చూపిస్తోంది: చంద్రబాబు

    ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్డీయే సాధించిన విజయం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. అభివృద్ధి దిశగా ఎన్డీయే చేస్తున్న పనికి ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు ఈ తీర్పు చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, నితిన్ నబీన్‌కు అభినందనలు తెలియజేశారు. అలాగే గెలిచిన అభ్యర్థులు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.



  • May 04, 2026 12:10 IST

    బెంగాల్‌లో బీజేపీ ఆధిక్యం 

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తాజా లెక్కల్లో బీజేపీ స్పష్టమైన ముందంజలో ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం ఆ పార్టీ సుమారు 176 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు.



  • May 04, 2026 11:47 IST

    బెంగాల్‌లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: సువేందు

    పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాదే విజయం,180 సీట్లకు పైగా సాధిస్తుంది. నందిగ్రామ్‌ భాజపా అభ్యర్థి సువేందు అధికారి



  • May 04, 2026 11:29 IST

    ట్రెండింగ్ లో విజయ్, త్రిష

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే బలంగా ముందుకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

    #TVKVijay హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో #electionresult2026 టాప్‌లో నిలిచింది.

    ఇక #Thalapathy, #Trisha, #HimantaBulldozedCongress, #JanaNayagan వంటి హ్యాష్‌ట్యాగ్‌లు కూడా వేగంగా ట్రెండ్ అవుతున్నాయి.



  • May 04, 2026 11:28 IST

    తాజా ఫలితాల్లో ముగ్గురు సీఎంలు వెనుకంజలో

    అసెంబ్లీ ఎన్నికల తాజా ట్రెండ్స్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులు వెనుకబడినట్లు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ భవానీపూర్‌లో వెనుకంజలో ఉన్నారు. తమిళనాడులో ఎం.కె. స్టాలిన్ కొళత్తూరులో వెనుకబడ్డారు. కేరళలో పినరయి విజయన్ ధర్మదం నియోజకవర్గంలో వెనుకంజలో కొనసాగుతున్నారు.



  • May 04, 2026 11:05 IST

    అవినీతి, దోపిడి, కుటుంబ రాజకీయాలకు ప్రజలు ముగింపు పలికారు: టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ జెరాల్డ్

    టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ జెరాల్డ్ మాట్లాడుతూ, ప్రస్తుతం కనిపిస్తున్న ఫలితాలు తమ నాయకుడి కృషికి ఫలితమని అన్నారు. ప్రజలు టీవీకేపై విశ్వాసం ఉంచారని, ఈ విధమైన ట్రెండ్ ముందుగానే ఊహించామని తెలిపారు.

    టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మొదటి నుంచే చెబుతున్నామని, అదే ఇప్పుడు నిజమవుతున్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు.

    డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల పాలనతో ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.

    ఎలాంటి పొత్తులు అవసరం లేకుండా టీవీకే ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    అవినీతి, దోపిడి, కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఇక ముగింపు పలికినట్లు ఈ ఫలితాలు చెబుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.



  • May 04, 2026 11:02 IST

    పుదుచ్చేరిలో రంగస్వామి విజయం

    పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రంగస్వామి విజయం. తట్టంచావడి స్థానం నుంచి విజయం సాధించగా, మంగళంలో ఆధిక్యంలో కొనసాగుతున్న రంగస్వామి



  • May 04, 2026 10:26 IST

    డీఎంకే కార్యకర్తల్లో నిరాశ

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ఉత్కంఠ పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ గణనీయంగా ముందంజలో ఉంది. సుమారు 100 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

    ఈ పరిస్థితుల్లో డీఎంకే కార్యాలయంలో నిరాశ వాతావరణం నెలకొంది. ముందుగా వేడుకల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను కార్యకర్తలు తొలగిస్తున్నారు.

    తాజా ఫలితాల్లో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో పాటు సుమారు 28 మంది మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నట్లు సమాచారం. దీంతో డీఎంకే శిబిరంలో ఆందోళన నెలకొంది.



  • May 04, 2026 10:25 IST

    డీఎంకే నేత సోము సంచలన వ్యాఖ్యలు

    డీఎంకే నేత ఎన్‌వీఎన్ సోము మాట్లాడుతూ, విజయ్‌కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారని తెలిపారు. వారంతా ఈ ఎన్నికల్లో ఆయనకే ఓటు వేశారని అభిప్రాయపడ్డారు.

    తమిళనాడులో సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని ప్రజలు ఆదరించే చరిత్ర ఉందని ఆయన చెప్పారు. ఇది కొత్త విషయం కాదని కూడా అన్నారు.

    అయితే చివరికి డీఎంకేకు మంచి సంఖ్యలో సీట్లు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.



  • May 04, 2026 10:21 IST

    బెంగాల్‌లో బీజేపీ ముందంజ 

    పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉండగా, ఇప్పటివరకు 265 స్థానాల ఫలితాల్లో ఆధిక్యాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ 150 సీట్లలో ముందంజలో ఉంది. మెజారిటీకి కావాల్సిన 148 మార్క్‌ను దాటడంతో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతోంది.

    తృణమూల్ కాంగ్రెస్ 111 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఒక సీటులో, ఇతరులు నాలుగు సీట్లలో ముందంజలో ఉన్నారు. ఈ ట్రెండ్ కొనసాగితే బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం బలంగా కనిపిస్తోంది.



  • May 04, 2026 09:52 IST

    ఏ రాష్ట్రంలో ఎవరి ఆధిక్యం? తాజా ఫలితాల ట్రెండ్ ఇలా...

    • బెంగాల్‌లో బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.
    • తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉంది.
    • కేరళలో యూడీఎఫ్ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తోంది.
    • అసోంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది.
    • పుదుచ్చేరిలో కూడా మళ్లీ బీజేపీ కూటమికే అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ట్రెండ్ సూచిస్తోంది.



  • May 04, 2026 09:51 IST

    కేరళ, అసోంలో స్పష్టమైన ఆధిక్యం..

    కేరళలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని యూడీఎఫ్ కూటమి సాధించింది.

    అదే విధంగా అసోంలో కూడా బీజేపీ కూటమి మెజారిటీ మార్క్ దాటేసి ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసుకుంది.



Advertisment
తాజా కథనాలు