Transformers : కంచే చేను మేసినట్లు :  ట్రాన్స్‌ఫార్మర్లనే నొక్కేసిన అధికారులు... ఐదుగురు సస్పెండ్!

ఘాజీపూర్ జిల్లాలో విద్యుత్ శాఖలో జరుగుతున్న భారీ అవినీతి, నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఏకంగా పది ప్రభుత్వ ట్రాన్స్‌ఫార్మర్లు దొంగతనానికి గురికావడం, ఇందులో ఉన్నతాధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో రాష్ట్ర విద్యుత్ శాఖలో ప్రకంపనలు రేగుతున్నాయి.

New Update
up govt

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో విద్యుత్ శాఖలో జరుగుతున్న భారీ అవినీతి, నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఏకంగా పది ప్రభుత్వ ట్రాన్స్‌ఫార్మర్లు దొంగతనానికి గురికావడం, ఇందులో ఉన్నతాధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో రాష్ట్ర విద్యుత్ శాఖలో ప్రకంపనలు రేగుతున్నాయి.

వివిధ గ్రామాల్లో పది ట్రాన్స్‌ఫార్మర్లు మాయమైనట్లు ఫిర్యాదులు అందినప్పటికీ, నెలల తరబడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం FIR కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన మేనేజింగ్ డైరెక్టర్ శంభు కుమార్, విద్యుత్ పంపిణీ విభాగంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

విస్తుపోయే నిజాలు

వాసుదేవ్‌పూర్, బెన్ సాగర్ ఫీడర్ల పరిధిలో జరిగిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ఆస్తుల మళ్లింపులో సబ్ డివిజన్ స్థాయి అధికారుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో తేలింది. విచారణ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. 

ఎస్‌డిఓ (SDO) ప్రమోద్ యాదవ్, జూనియర్ ఇంజనీర్లు రాజీవ్ గుప్తా, నీరజ్ కుమార్‌లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ చోరీతో సంబంధం ఉన్నట్లు తేలిన లైన్‌మెన్లు శివకుమార్, రమేష్‌లను సర్వీసు నుండి తొలగించారు."ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగాన్ని సహించేది లేదు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా జవాబుదారీతనాన్ని పెంచుతాము అని  సూపరింటెండింగ్ ఇంజనీర్ వివేక్ ఖన్నా వెల్లడించారు.  

Advertisment
తాజా కథనాలు