National Women's Day: సరోజినీ నాయుడు జన్మదినాన్ని మహిళా దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

సరోజినీనాయుడు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన మహిళ. ఫిబ్రవరి 13, 1879న హైదరాబాద్‌లోని బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కవిత్వం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉండేది. ఆమె జన్మదినాన్నే జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు.

New Update
National Women's Day: సరోజినీ నాయుడు జన్మదినాన్ని మహిళా దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Sarojini Naidu Birthday : నేడు(ఫిబ్రవరి 13) భారత జాతీయ మహిళా దినోత్సవం(National Women's Day). ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. సరోజినీ నాయుడు(Sarojini Naidu) భారతదేశపు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు.. కవయిత్రి కూడా. ఆమెను భారత్ కోకిల అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా(Nightingale Of India) అని కూడా పిలుస్తారు. ఇది మాత్రమే కాదు, ఆమె స్వతంత్ర భారతదేశానికి మొదటి మహిళా గవర్నర్ కూడా. దేశానికి స్వాతంత్య్రం పొందడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్రం ఉద్యమంలో ఆమె పాత్ర ముఖ్యమైనది. ప్రతి మహిళకు ఆమె స్ఫూర్తి. ఫిబ్రవరి 13న సరోజినీనాయుడు జన్మించారు. అందుకే ఈరోజును జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవం(Women's Day) కంటే ఇది భిన్నమైనది. ఎందుకంటే ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఫిబ్రవరి 13 భారత మహిళా దినోత్సవం. కన్ఫ్యూజ్‌ అవొద్దు.


చిన్నతనంలోనే పద్యాలు రాసిన నైటింగేల్:
సరోజినీ నాయుడు 1879లో ఫిబ్రవరి 13న జన్మించారు. ఆమె చిన్నప్పటి నుంచి తెలివైనది. సరోజినీ నాయుడు తన 12వ ఏటనే పద్యాలు రాయడం ప్రారంభించారు. తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. దేశ స్వాతంత్య్ర, మహిళల హక్కుల కోసం పోరాడారు. స్వాతంత్య్రానంతరం సరోజినీ నాయుడుకు తొలి మహిళా గవర్నర్‌గా అవకాశం లభించింది. సరోజినీనాయుడు చేసిన కృషికి, మహిళల హక్కుల కోసం ఆమె చేసిన పాత్రకు గుర్తింపుగా ఆమె పుట్టినరోజు సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

సరోజినీ నాయుడు ఇంగ్లండ్‌లో చదువుతున్నప్పుడు, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులను కలిశారు. అక్కడ డాక్టర్ గోవిందరాజులు నాయుడుని కలిశారు. 1898లో సరోజిని తన చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌కు తిరిగి వచ్చి వైద్యుడయిన డాక్టర్ నాయుడుని వివాహం చేసుకోవాలని తన కోరికను వ్యక్తం చేసింది. ఇందుకు డాక్టర్ నాయుడు కూడా సిద్ధమయ్యారు. ఇద్దరి కుటుంబాలు కూడా ఈ ప్రతిపాదనను ఆమోదించాయి.

కులంతార వివాహం:
ఆమె 19 సంవత్సరాల వయస్సులో ఛటోపాధ్యాయ(Chattopadhyay) ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కూడా ప్రత్యేకమైనది ఎందుకంటే అప్పట్లో వేరే కులానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం చాలా కష్టం. సమాజం దీనిని అంగీకరించలేదు. సరోజిని బ్రాహ్మణురాలు. ఆమె భర్త బ్రాహ్మణేతర కుటుంబానికి చెందినవారు. అయినప్పటికీ, ఈ కులాంతర వివాహంలో సరోజిని తండ్రి ఆమెకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. వారిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు, వారి పేర్లు జయసూర్య, పద్మజ, రణధీర్, లీలామణి.

Also Read: లక్షలాది వివాహాలు..లక్షల కోట్ల వ్యాపారం.. పీక్స్ లో పెళ్లిళ్ల సీజన్ అంచనాలు

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు