National Tourism Day 2024: ఈ మూడు రొమాంటిక్ హనీమూన్ స్పాట్స్‌ గురించి తెలుసా? తప్పకుండా వెళ్లండి.

పెళ్లి తర్వాత హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లాలా అని చాలా మంది వివాహం జరగకముందు నుంచే కలలు కంటుంటారు. దేశంలో హనీమూన్‌ డెస్టినేషన్స్‌ చాలానే ఉన్నప్పటికీ.. ప్రజలు ఎక్కువగా ఇష్టపడిన స్పాట్స్‌ మూడు ఉన్నాయి. అందులో మొదటిది అండమాన్‌, రెండోది కేరళలోని అలెప్పీ, మూడోది గోవా.

New Update
National Tourism Day 2024: ఈ మూడు రొమాంటిక్ హనీమూన్ స్పాట్స్‌ గురించి తెలుసా? తప్పకుండా వెళ్లండి.

నేడు జాతీయ పర్యాటక దినోత్సవం (National Tourism Day)

హనీమూన్ డెస్టినేషన్ ప్రత్యేకంగా ఉండాలి. కొత్త జీవితం ఆరంభాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే కొండల నుంచి బీచ్‌ల వరకు.. హనీమూన్ కపుల్‌ ఎంజాయ్‌ చేయడానికి దేశంలో అనేక రొమాంటిక్ ప్రదేశాలు ఉన్నాయి. దేశంలో అద్భుతమైన, అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రశాంతమైన పరిసరాల్లో సేదతీరడం, బీచ్‌లో సరదాగా గడపడం, కొండల మధ్య అద్భుతమైన దృశ్యాలను ఆస్వాదించడం.. క్యాండిల్‌ లైట్‌ రొమాంటిక్‌ డిన్నర్‌ లాంటివన్నీ దేశంలో అనుభవించవచ్చు.

దేశంలో బెస్ట్ హనీమూన్ స్పాట్స్ (Honeymoon Spots):

అండమాన్ అండ్‌ నికోబార్ దీవులు:
అండమాన్ అండ్‌ నికోబార్ ఐల్యాండ్స్‌ (Andaman and Nicobar Islands) హనీమూన్ కోసం దేశంలోని బెస్ట్ స్పాట్స్‌లో ఒకటి. దేశానికి ఆగ్నేయం బంగాళాఖాతంలో ఉన్న ఆక్వా-ఆకుపచ్చ జలాలు, మెరిసే బీచ్‌లు, అద్భుతమైన సహజ దృశ్యాలు, ఉష్ణమండల అడవులు ఈ ఐట్యాండ్స్‌ సొంతం. అండమాన్ అండ్‌ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు మన ఇండియాలోనే టాప్‌ నగరాల నుంచి రెగ్యులర్‌గా విమానాలు ఉన్నాయి. అండమాన్ అండ్‌ నికోబార్ సందర్శనకు అక్టోబర్ నుంచి మార్చి వరకు మంచి సమయం. ప్రకృతి అందాలు, సాహసయాత్రలకు అవకాశాలు, బీచ్ రిసార్ట్స్, ప్రశాంతత పుష్కలంగా ఉన్న ఈ గమ్యం చిరస్మరణీయమైన హనీమూన్ అనుభవానికి అనువైనది. దంపతులు స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, కయాకింగ్ లాంటి వాటర్‌ గేమ్స్‌ని ఆస్వాదించవచ్చు.

అలెప్పీ:
కేరళలోని అలెప్పీ (Alappuzha) ప్రకృతి ఆకర్షణకు ప్రసిద్ధి చెందింది. మన దేశంతో పాటు విదేశాల నుంచి జంటలను ఆకర్షించే బెస్ట్‌ హనీమూన్ ప్రదేశాలలో ఒకటి. అలెప్పి లేదా అలప్పుజ బ్యాక్ వాటర్స్, అరేబియా సముద్రం మధ్య ఉన్న ఒక భూభాగం . ఉష్ణమండల పచ్చదనం, బ్యాక్ వాటర్ ద్వీపాలు, కొబ్బరి చెట్లతో ఈ ప్రాంతం ఎంతో అందంగా కనిపిస్తుంది. హనీమూన్ గమ్యస్థానం హౌస్ బోట్ రైడ్‌లకు జంటలకు ఉత్తమమైనదిగా పరిగణించవచ్చు. హనీమూన్ హౌస్ బోట్‌లో ప్రయాణించడం వల్ల స్పెషల్ రొమాంటిక్ లొకేషన్‌లో కలిసి సేదతీరడానికి సమయం దొరుకుతుంది. దంపతులు యోగా, ఆయుర్వేద మసాజ్‌లు, స్పా, మెడిటేషన్, రుచికరమైన సీఫుడ్‌ను కూడా ఆస్వాదించవచ్చు. పురాతన చర్చిలతో పాటు నగరంలోని ప్రసిద్ధ బీచ్‌లను చుట్టేయవచ్చు.

గోవా:
అత్యంత రొమాంటిక్ హనీమూన్ ప్రదేశాలలో గోవా (Goa) ఒకటి. గోల్డెన్‌ సోయిల్, బీచ్‌లతో పాటు, చర్చిలు, కోటలు, పురాతన వలస పోర్చుగీస్ భవనాలు ఆస్వాదించడానికి ఆహ్లాదకరమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇక వంటకాలు కూడా వెరైటీ టెస్టీ. రొమాంటిక్ కపుల్‌ ప్రశాంతమైన పరిసరాల్లో సేదతీరడానికి అందాన్ని ఆస్వాదించడానికి చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి. విలాసవంతమైన హోటళ్లలో గడపవచ్చు. రొమాంటిక్ క్యాండిల్‌ లైట్‌ డిన్నర్ చేయవచ్చు. గోవాలో వాటర్ స్కీయింగ్, పారాసైలింగ్, విండ్ సర్ఫింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. కపుల్‌కి మరింత ప్రైవేసీ కావాలంటే విలాసవంతమైన రిసార్ట్‌ను ఎంచుకోవచ్చు.. లేదా బీచ్‌ వద్ద ఒక విల్లాను అద్దెకు తీసుకోవచ్చు. సుందరమైన బీచ్‌లు,క్రూయిజ్‌ల నుంచి చారిత్రాత్మక స్మారక చిహ్నాలతో పాటు నైట్ క్లబ్‌ల వరకు గోవా పెట్టింది పేరు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గోవా సందర్శనకు మంచి టైమ్.
ALSO READ: గోరువెచ్చని నీరు తాగడం వల్ల నిజంగా ప్రయోజనాలున్నాయా?

Advertisment
Advertisment
తాజా కథనాలు