కొహ్లీ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా! జిమ్ వీడియో వైరల్ ఫిట్‌నెస్ కోసం చాలామంది జిమ్ సెంటర్లలో గంటల కొద్దీ కసరత్తులు చేస్తుంటారు. అలా జిమ్‌లో సెలబ్రెటీలు, క్రికెటర్లు తమ శరీరాన్ని ధృఢంగా చేసుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనునిత్యం జిమ్‌లో గంటలకొద్ధి జిమ్ చేస్తుంటాడు. ప్రస్తుతం విండీస్ టూర్‌లో ఉన్న విరాట్, జిమ్‌లో వర్కౌట్‌లు చేస్తున్న వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. By Shareef Pasha 18 Jul 2023 in నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి టీమిండియాలో ఫిట్‌నెస్ పరంగా విరాట్ కోహ్లీ కొత్త ప్రమాణాలను నెలకొల్పాడు . ప్రతి రోజూ మరింత రాటుదేలేందుకు కష్టపడుతుంటాడు. విండీస్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఉన్న కోహ్లీ తన రెండో టెస్టు కోసం సింసిద్దం అవుతున్నాడు. ఎక్సర్‌సైజ్ నుంచే తనకు ప్రేరణ లభిస్తుందని గతంలో ఎన్నోసార్లు విరాట్ తెలిపాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కెరీర్ తొలి నాళ్లలో చబ్బీగా కనిపించిన విరాట్.. ఫీల్డింగ్‌లో చురుగ్గా లేకపోవడంపై తనను తానే నిందించుకున్నాడు. ఇక అప్పటి నుంచి శారీరక శ్రమను తన డైలీ రొటీన్‌లో భాగం చేసుకున్న కోహ్లీ.. అనునిత్యం జిమ్‌లో పాల్గొంటున్నాడు. జట్టులోని ఇతర ప్లేయర్ల కంటే ఫిట్‌గా ఉండే.. విరాట్ అందుకోసం తన ఇష్టమైన తిండిని వదులుకోవడంతో పాటు.. అందరికంటే ఎక్కువసేపు శ్రమిస్తుంటాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) స్వతహాగా భోజన ప్రియుడైన విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే ఏదీ ఎక్కువ కాదనే ఉద్దేశంతో తన దినచర్యను మార్చుకున్నాడు. పరిమిత డైట్‌తోనే సాగుతున్న కోహ్లీ.. మైదానంలో చిరుతలా పరిగెత్తేందుకు ప్రాక్టీస్ సెషన్‌లో గంటల తరబడి శ్రమిస్తుంటాడు. ఇందులో భాగంగా వెస్టిండీస్ టూర్‌లో ఇప్పటికే లెగ్ ఎక్సర్‌సైజ్‌లకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన విరాట్.. తాజాగా.. చేతిలో బరువులు పట్టుకొని బస్కీలు తీస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో కింగ్ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎక్సర్‌సైజ్‌కు సంబంధించిన వీడియోపై నెటిజన్ల కామెంట్లు ఇతర ఆటగాళ్ల కంటే అరగంట ముందే ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చే విరాట్ కోహ్లీ.. అందరి సాధన ముగిసిన తర్వాత కూడా నెట్స్‌లో చెమటోడుస్తుంటాడని.. గతంలో ఎందరో చెప్పిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌పై తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయాన్నందుకున్న టీమిండియా.. రెండో టెస్టులోనూ సులువుగా గెలవడం ఖాయమని అంతా అంటుంటే.. కోహ్లీ మాత్రం ప్రత్యర్థిని చిన్నదిగా భావించడం లేదని తన సాధనతో మరోసారి రుజువు చేశాడు. ఫిట్‌నెస్ ప్రమాణాలు బాగుంటేనే మైదానంలో చురుకుగా కదలగలమని.. తన సారథ్యంలో జట్టులోని ఆటగాళ్లకు నూరిపోసిన విరాట్ వారందికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. విరాట్ ఎక్సర్‌సైజ్ కు సంబంధించిన వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. బాబర్ ఆజమ్‌ను పోలుస్తూ.. చమక్కులు పేలుస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి