శంషాబాద్ వద్ద ఉద్రిక్తత.. కిషన్ రెడ్డి అరెస్ట్ శంషాబాద్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారులోని బాటసింగారంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించడానికి కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు బయలుదేరారు. ఐతే కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు శంషాబాద్ చేరుకోగానే వారిని పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. By Shareef Pasha 20 Jul 2023 in రాజకీయాలు హైదరాబాద్ New Update షేర్ చేయండి బాటసింగారం వెళ్లేందుకు అనుమతి లేదని బీజేపీ నేతలకు పోలీసులు తెలపడంతో.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు. తాము హత్యలు చేయడానికి వెళ్లడంలేదని, పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పరిశీలించడానికి వెళ్తున్నామన్నారు.ఐనా పోలీసులు ససేమీరా అనడంతో కిషన్ రెడ్డి, రఘునందన్ రావులతో పాటు బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. నగరంలో వర్షం పడుతున్నా.. వారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై కూర్చొని సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో ప్రతిపక్ష నేతలు ఇతర ప్రాంతాలకు తిరిగే స్వేచ్చ లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ నియంత పాలనలో ప్రజాస్వామ్యానికి భంగం వాటిళ్లుతోందన్నారు. తెలంగాణలో కేవలం కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రమే కొనసాగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత 9 ఏళ్లలో కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ లేకుండా చేస్తున్నాడని కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బాటసింగారం వెళ్తున్న విషయంపై హైదరాబాద్ పరిధిలో ఉండే బీజేపీ నేతలకు మాత్రమే సమాచారం ఇచ్చానని, కానీ ఆదిలాబాద్‌లో ఉన్న బీజేపీ నేతలు సైతం బాటసింగారం వచ్చేందుకు రెడీ అయ్యారన్నారు. బీజేపీ నేతలతో పాటు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న చాలామంది రైతులు సైతం స్వచ్చందంగా తమ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారని వెళ్లడించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్‌లు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీ రాష్ట్ర స్థాయి, జిల్లా నేతలను, మండల పార్టీ నేతలను సైతం అరెస్ట్ చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి