జైస్వాల్ తొలి టెస్టులోనే సెంచరీ! అనంతరం తన తండ్రి ఏం చేసాడో తెలుసా..? తొలి టెస్టులోనే భారీ సెంచరీ చేసి తన జర్నీని గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు యశస్వి జైస్వాల్ అనే కుర్రాడు. ఈ సందర్భంగా తన తండ్రి చేసిన పని ఏంటో తెలుసా.. అదే ప్రస్తుతం సోషల్‌మీడియాలో వేదికగా తెగ వైరల్ గా మారి హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ జైస్వాల్ తండ్రి జైస్వాల్ కోసం ఏం చేశాడంటే తన కొడుకు కోసం ఏకంగా తన భుజాన గంగాజలాన్ని మోసుకొని తమ నివాసం నుంచి ఏకంగా ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘడ్‌కి కాలినడకన బయలుదేరాడు. By Shareef Pasha 17 Jul 2023 in నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి టీమిండియా యంగ్ సంచలనం యశస్వి జైస్వాల్ తన తొలి టెస్టుని మెమరబుల్ గా మార్చుకున్నాడు. ఐపీఎల్‌లో రాణించడం, ఆ తర్వాత విండీస్ టూర్ లో భాగంగా టెస్టు స్క్వాడ్ లో జట్టులో స్థానం దక్కడం, తుది జట్టులో ఆడే అవకాశం రావడం, తొలి టెస్టులోనే భారీ శతకంతో మెరవడం ఇదంతా చకచకా.. కేవలం రెండు నెలల్లోనే పూర్తి అయిపోయింది. ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్న జైస్వాల్.. భవిష్యత్తు స్టార్ గా కితాబులందుకుంటున్నాడు. ఒక్క ఇన్నింగ్స్ తో తనను తాను నిరూపించుకొని టీమిండియా ఆశాకిరణంలా మారాడు. ఎంతో నైపుణ్యం ఉన్న బ్యాటర్ లాగా, పరిణితి చెందిన ఆటతో ఆకట్టుకున్నాడు. ఇదంతా చూసిన జైస్వాల్ తండ్రి.. కొడుకు తొలి మ్యాచులోనే సెంచరీ చేయడంతో కావండ్ యాత్రకు బయలుదేరాడు. पहले ही मैच में बेटे के शतक से खुश यशस्वी जायसवाल के पिता भूपेंद्र जायसवाल आज कांवड़ यात्रा पर बाबा धाम जा रहे हैं। उनकी दिली इच्छा है कि उनका बेटा इस शतक को दोहरे शतक में बदले। #YashasviJaiswal #INDvsWI #TestCricket pic.twitter.com/sa6T73axej— Bhadohi wallah (@BhadohiWallah) July 14, 2023 171 పరుగులు చేసి సత్తా చాటిన జైస్వాల్ విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో జైస్వాల్ 171 పరుగులు చేసి సత్తా చాటాడు. జైస్వాల్ జట్టులో అందరికంటే జూనియర్ అయినా.. టీమిండియా టాప్ స్కోరర్ కావడం విశేషం. అంతేకాదు తనాడిన తొలి మ్యాచులోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచి తన ఎంట్రీని గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. ఇక ఈ సెంచరీని జైస్వాల్ తన తల్లిదండ్రులకి అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ... తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే జైస్వాల్ తండ్రి మాత్రం కొడుకుని మించి సంబరాలు చేసుకుంటున్నాడు. భుజాన గంగాజలాన్ని మోసుకొని తమ నివాసం నుంచి ఏకంగా ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘడ్‌కి కాలినడకన బయలుదేరాడు. జైస్వాల్ తండ్రి దేవ్‌ఘడ్‌కి కాలినడకన యాత్ర యశస్వికి టెస్టు క్యాప్ దక్కడం, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిస్ ఓపెనింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అతను మరిన్ని సంతకాలు సాధించాలి. అతను సాధించిన శతకం మా కుటుంబంతో పాటు మా జిల్లా అంతా గర్వపడుతుంది. అతడు క్రికెట్ లో మరింత ముందుకెళ్లాలని ఈ యాత్రను చేపట్టాను. నా కుమారుడిని ఇలాగే ఆశీర్వదించాలని ఆ వైద్యనాధుడికి జలాభిషేకం చేసి వేడుకుంటానని జైస్వాల్ తండ్రి తెలిపాడు. ఇక ఈ మ్యాచులో జైస్వాల్ సెంచరీతో పాటు అశ్విన్ బౌలింగ్‌లో రాణించడంతో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 20 న జరుగనుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి