తొలిపోస్టింగ్ రోజే మహిళా అధికారి కొంపముంచిన లంచం

ఎన్నో ఆశలతో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంటారు చాలామంది. కానీ అత్యుతాహంతో జాబ్‌లో జాయిన్ కాగానే అవినీతికి పాల్పడుతుంటారు. అలాగే,.. ఇక్కడ ఓ మహిళా అధికారిని తనకు పోస్టింగ్‌ ఇచ్చిన రోజే.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడింది. దీంతో అధికారులు షాక్‌ అయ్యారు. పస్ట్ పోస్టింగ్ రోజే లంచం తీసుకున్నావా అంటూ ప్రశ్నించారు.

New Update
తొలిపోస్టింగ్ రోజే మహిళా అధికారి కొంపముంచిన లంచం

భారత్‌లోని ఝార్ఖండ్‌ రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా అధికారి తన జాయిన్‌ ఫార్మాల్టీస్ పూర్తి చేసుకొని గవర్నమెంట్‌ జాబ్‌లో జాయిన్ అయింది. జాయిన్‌ అయినాకా తొలిపొస్టింగ్‌ ఇచ్చిన రోజే కక్కుర్తి పడింది. లంచం కోసం చేయి చాచింది. లంచం తీసుకుంటున్న మహిళా అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

తొలి పోస్టింగ్ రోజే లంచం

ఎనిమిది నెలల క్రితం మిథాలి శర్మ, కోడర్మ జిల్లాలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. అదే ఆమెకు తొలి పోస్టింగ్. కానీ, డబ్బులపై కక్కర్తితో ఆమె అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. లంచం తీసుకుంటుండగా అవినీతి అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల వివరణ ప్రకారం... మిథాలీ శర్మ తొలుత కోడర్మా జిల్లాలోని వ్యాపార్ సహ్యోగ్ సమితిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా అక్కడి లావాదేవీలు పరిశీలించగా లెక్కల్లో రూ.20 వేల మేరకు తేడా కనిపించింది.

మహిళా అధికారిని కొంపముంచిన లంచం

దీంతో... న్యాయం చేయాలని తన దగ్గరకు వచ్చిన బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆమె లంచం డిమాండ్ చేశారు. అయితే, మిథాలీ డిమాండ్‌పై ఆ సంస్థ సిబ్బంది ఒకరు అవినీతి నిరోధక శాఖ డీజీకి ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు పక్కా ప్లాన్‌తో ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాలకు పంపారు. అంతేకాకుండా అవినీతి నిర్మూలన సంస్ధ ఎప్పటికప్పుడు ఒక కంట కనిపెడుతూనే ఉంటామని తెలిపారు. ఎవరు అవినీతికి పాల్పడిన సరే మాకు సమాచారం అందించండంటూ ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు