యాంకర్లకు కొత్త తలనొప్పిగా మారిన ఏఐ న్యూస్ యాంకర్ 'లిసా' అధునాతన టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకెళ్తోంది. చాట్ జిపిటి ద్వారా రాయడం, చదవడం వంటి అనేక పనులను సునాయాసంగా చేస్తున్నాయి. తాజాగా.. కృత్రిమ మేధ సహాయంతో టీవీ యాంకర్లను కూడా టెలివిజన్ స్క్రీన్ మీదకు తీసుకువస్తున్నారు. దీంతో రియల్ యాంకర్లను తీసిపోని ఈ టెక్నాలజీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందేందిరయ్యా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By Shareef Pasha 10 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ప్రపంచంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అన్ని దేశాలకు విస్తరిస్తోంది. దీంతో ఇప్పటికే మనుషులు మాన్యువల్ గా చేయాల్సిన పనులను కంప్యూటర్లు, యంత్రాల సహాయంతో శరవేగంగా చేస్తున్నారు ఆయా కంపెనీలు. టెక్నాలజీ పరుగులు తీస్తున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకు తన అడ్వాన్స్మెంట్ చూపిస్తుంది. అన్ని పనులను చేసేలా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వస్తుంది. Meet Lisa, OTV and Odisha’s first AI news anchor set to revolutionize TV Broadcasting & Journalism#AIAnchorLisa #Lisa #Odisha #OTVNews #OTVAnchorLisa pic.twitter.com/NDm9ZAz8YW— OTV (@otvnews) July 9, 2023 ఏఐ సహాయంతో న్యూస్ యాంకర్ రూపకల్పన తాజాగా.. ఒడిశాకు చెందిన ఓ టీవీ కృత్రిమ మేథ (ఏఐ) సహాయంతో ఓ న్యూస్ యాంకర్ ను రూపొందించింది. ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ లిసా ను రూపొందించింది. యాంకర్ లిసా ఒడిస్సా సాంప్రదాయ చేనేత చీరను ధరించి చక్కని ఆహార్యంతో కంప్యూటర్లో రూపొందించబడిన మోడల్. ఇక ఆ న్యూస్ యాంకర్ సదరు టెలివిజన్లోనూ, డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనూ ఒరియా తోపాటు ఇంగ్లీషులోనూ వార్తలు చదివే విధంగా ప్రోగ్రామ్ చేయబడిన యాంకర్. చీర కట్టులో అచ్చమైన మహిళ లాగా కృత్రిమ మేధ తో తయారుచేసిన వర్చువల్ న్యూస్ యాంకర్ వార్తలను గడగడా చదివేసింది. కృత్రిమ మేధస్సుతో తయారుచేయబడిన లిసా అసలైన న్యూస్ యాంకర్ లా లిసా వార్తలు చదివిన తీరు అందరినీ అబ్బురపరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేయబడిన ఈ యాంకర్ బహుళ భాషలు మాట్లాడగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒరియా, ఇంగ్లీష్ వార్తలను చదవడం పైనే దృష్టి ఉంటుంది. ఒడిశాలో కృత్రిమ మేధస్సుతో తయారుచేయబడిన లిసా యాంకర్ గా టెలివిజన్ స్క్రీన్ మీదకు రావడం ఒక ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని చెబుతున్నారు. రాబోయే రోజులలో మరింత నైపుణ్యం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సైట్లలో కూడా ముందు ముందు లిసాను చూడవచ్చని ఓటీవీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే, ఖర్చు తక్కువగా ఉంటే ముందు ముందు నిజమైన యాంకర్ల స్థానంలో వర్చువల్ యాంకర్లు వచ్చి చేరడం మాత్రం ఖాయం అంటున్నారు నిపుణులు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి