ఇంట్లోకి చొరబడ్డ చిరుతను భయపెట్టిన కుక్క..! అర్ధరాత్రి చిరుత ఒక ఇంట్లోకి చొరబడింది. పెంపుడు కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దాని పప్పులు కుక్క ముందు ఏం మాత్రం ఉడకలేదు. ఆ కుక్క గట్టిగా మొరిగి చిరుతను భయపెట్టింది. దీంతో ఆ చిరుత చేసేదేమిలేక వెనుతిరిగి అక్కడి నుంచి గోడ దూకి పారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారి, నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. By Shareef Pasha 29 Jun 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి చిరుత ఒక ఇంట్లోకి చొరబడింది. పెంపుడు కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుక్క గట్టిగా మొరిగి చిరుతను భయపెట్టింది. దీంతో ఆ చిరుత వెనుతిరిగి అక్కడి నుంచి పారిపోయింది. ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాహురి తాలూకాలోని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక ఇంటి కాంపౌడ్‌లోకి అర్ధ రాత్రి వేళ చిరుత ప్రవేశించింది. ఆ ఇంటికి కాపలా ఉన్న కుక్క వద్దకు అది మెల్లగా వచ్చింది. దాడి చేసి తినేందుకు ఆ కుక్కను సమీపించింది. కాగా, చిరుతను చూసిన ఆ కుక్క ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు. పైగా చిరుతను చూసిన కుక్క గట్టిగా మొరిగింది. ఎదురు దాడికి సైతం దిగింది. ఆ కుక్కను తట్టుకోలేక చిరుత వెనక్కి తగ్గింది. మెల్లగా అక్కడి నుంచి గోడ దూకి పారిపోయింది. ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీలో ఇదంతా రికార్డు అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మరోవైపు, ఈ ఏడాది జనవరిలో కర్ణాటకలోని రామ్‌నగర్ ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక చిరుత ప్రహరీ గొడ నుంచి దూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న పెంపుడు కుక్కపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే చిరుత దాడిని ఆ కుక్క ఎదుర్కొంది. పెంపుడు కుక్క తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆ చిరుత అక్కడి నుంచి పారిపోయింది. https://twitter.com/ANI/status/1674092711459328000 #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి