చంద్రయాన్-3 మిషన్‌పై అదిరిపోయే శాండ్ ఆర్ట్, సక్సెస్ అవ్వాలంటూ..! చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సన్నద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఇస్రో చందమామ దగ్గరికి చంద్రయాన్-3ని పంపించనుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ ప్రయోగానికి సంబంధించిన చర్చే జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రయాన్-3 ప్రయోగం ట్రెండింగ్‌లో ఉంది. ఇక సైకత శిల్పి సుదర్శన పట్నాయక్ .. చంద్రయాన్ నమోనా శిల్పాన్ని రూపొందించారు. By Shareef Pasha 14 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి పూరీ బీచ్‌లో సైకత శిల్పాన్ని క్రియేట్ చేశారు. సైకత శిల్పి సుదర్శన పట్నాయక్.. చంద్రయాన్ నమోనా శిల్పాన్ని వేశారు. పూరీ బీచ్‌లో ఆయన సైకత శిల్పాన్ని క్రియేట్ చేశారు. సుమారు 22 ఫీట్ల పొడువుతో .. చంద్రయాన్-3 సాండ్ ఆర్ట్ వేశారు. దీని కోసం ఆయన 500 స్టీల్ గిన్నెలను వాడారు. విజయీ భవ అంటూ ఆ సైకత శిల్పపై సందేశం రాశారు. శ్రీహరికోటలో కౌంట్‌డౌన్ కొనసాగుతున్నట్లు కాసేపటి క్రితం ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రుడిపై మూడవ ప్రయత్నంగా ఇండియాన ల్యాండర్‌ను దించాలనుకుంటోంది. ఇవాళ మధ్యాహ్నం 2.35 నిమిషాలకు ఎల్వీఎం3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ మిషన్‌ను చేపట్టనున్నారు. దీని కోసం నిన్న కౌంట్‌డౌన్ ప్రారంభించారు. #WATCH | Renowned sand artist Sudarsan Pattnaik created a 22 ft long sand art of Chandrayaan 3 with the installation of 500 steel bowls with the message "Bijayee Bhava", at Puri beach in Odisha, yesterday.The Indian Space Research Organisation's third lunar exploration mission,… pic.twitter.com/Gr4SNEZDEy— ANI (@ANI) July 13, 2023 అయితే శ్రీహరికోటలో ఆ కౌంట్‌డౌన్ కొనసాగుతున్నట్లు కాసేపటి క్రితం ఇస్రో ట్వీట్ చేసింది. L110 స్టేజ్‌కు చెందిన ప్రొపెల్లంట్ నింపడం పూర్తి అయినట్లు పేర్కొన్నది. ఇక సీ25 స్టేజ్ కోసం ఫిల్లింగ్ ప్రారంభమైనట్లు ఇస్రో వెల్లడించింది. ప్రతిష్టాత్మంగా తీసుకున్న ఈ ప్రయోగానికి గురువారం కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. తొలిసారిగా చంద్రుడికి ఆవల వైపు ల్యాండర్, రోవర్‌లను పంపనున్నారు. అందుకే యావత్ ప్రపంచం ఇస్రో ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. మంచి ఉత్సాహం మీద ఉన్న ఇస్రో మాత్రం కచ్చితంగా ఈ ప్రయోగం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. 2019 జులై 15 చంద్రయాన్-2 ప్రయోగం చేసి ఇస్రో విపలమైంది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మాత్రం పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు చెబుతున్నారు. LVM3 M4/Chandrayaan-3 Mission:The countdown is progressing at SDSC-SHAR, Sriharikota.Propellant filling in the L110 stage is completed. Propellant filling in the C25 stage is commencing.— ISRO (@isro) July 14, 2023 చంద్రుని వద్ద ఉన్న మరిన్ని రహస్యాలను ఛేదించేందుకే ఈ ప్రయానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. చంద్రయాన్-3లో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలు ఉంటాయి. టోటల్‌గా దీని బరువు 3,920గా చెబుతున్నారు. ఈసారి కేవలం ఆరు పేలోడ్స్‌ను మాత్రమే పంపుతున్నారు. ఇందులో ఒక ఇస్రో పేలోడ్ ఉంది. చంద్రుడిపై ల్యాండర్ ను దింపే సత్తా భారత్ ఇస్రోకు ఉందని అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ అన్నారు. చంద్రయాన్ 3 పై మాట్లాడిన ఆయన చంద్రుడు లక్ష్యంగా భారత్ చేస్తున్న చంద్రయాన్ మిషన్ విజయవంతమైన ప్రయోగం అన్నారు. చంద్రుడి మీద ల్యాండర్ ను సేఫ్ ల్యాండ్ చేసి ఈ ఘనత సాధించిన నాలుగోదేశంగా భారత్ కీర్తి గడిస్తుందని నంబి నారాయణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి