అమర్‌నాథ్ యాత్రలో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్న బ్యాడ్మింటన్‌ సైనా నెహ్వాల్‌

బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ సైనా నెహ్వాల్‌ అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. అక్కడ అమర్‌నాథ్‌ గుహను సందర్శించి బాబా బర్ఫాని ఆశీస్సులు తీసుకున్నారు. అమర్‌ నాథ్‌ యాత్రకు వెళ్లిన ఫొటోలను సైనా నెహ్వాల్‌ ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.పెళ్ళైన ఐదేళ్ల తరువాత మొదటిసారి ఈమె అమర్ నాథ్ యాత్రలో పాల్గొన్నారు. బుధవారం 7805 మంది భక్తులను అమర్‌నాథ్‌ యాత్రకు అధికారులు అనుమతించారు.

New Update
అమర్‌నాథ్ యాత్రలో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్న బ్యాడ్మింటన్‌ సైనా నెహ్వాల్‌

అమర్‌నాథ్‌ యాత్ర పూర్తి చేయడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, దర్శనం పొందడం తన అదృష్టంగా భావిస్తున్నానని, తీర్థయాత్రను సులభతరం చేసినందుకు, యాత్రికుల భద్రత, సౌకర్యాన్ని చూసుకున్నందుకు అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు, ఆర్మీ వాళ్ళకి సైనా నెహ్వాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమర్‌నాథ్ వంటి ప్రదేశాలను సందర్శించడం వల్ల మనిషికి ఎంతో ప్రశాంతత, సానుకూలత లభిస్తాయని ఆమె అన్నారు. ఆమె తల్లి ఉషా రాణి నెహ్వాల్ కూడా నిర్వహణ యొక్క సమర్థతను మెచ్చుకున్నారు. ప్రజలు తీర్థయాత్రలో పాల్గొనాలని సూచించారు.

అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్

సైనా నెహ్వాల్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా షేర్ చేసింది. ఈ చిత్రాలలో బాబా బర్ఫానీని సందర్శించేటప్పుడు సైనా నెహ్వాల్ ఎంతో సంతోషంగా, చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ యాత్రలో తన అనుభూతులను నెటిజన్లతో పంచుకుంది. ఈ యాత్ర చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

అమర్‌నాథ్ యాత్రకు 10వ బ్యాచ్ భక్తులు వీళ్లే...

సమాచారం ప్రకారం.. బుధవారం 7805 మంది యాత్రికుల పదవ బ్యాచ్ బాబా అమర్‌నాథ్ వార్షిక తీర్థయాత్ర కోసం జమ్మూలోని యాత్రి నివాస్ నుండి పహల్గామ్, బల్తాల్‌లకు పంపబడింది. యాత్రకు సంబంధించి భక్తుల ఉత్సాహం నిరంతరం పెరుగుతోంది. బల్తాల్ మార్గంలో పంపిన 3128 మంది యాత్రికుల బ్యాచ్‌లో 2293 మంది పురుషులు, 772 మంది మహిళలు, 26 మంది పిల్లలు, 37 మంది సాధువులు ఉన్నారు. పహల్గామ్ మార్గంలో ప్రయాణించడానికి పంపిన 4677 మంది యాత్రికుల బ్యాచ్‌లో 3537 మంది పురుషులు, 991 మంది మహిళలు, 34 మంది పిల్లలు, 115 మంది సాధువులు ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు