ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు, బీభత్సం సృష్టించిన వరదలు కుండపోత వర్షాలతో ఉత్తర భారత్ జనాలు వణికిపోతున్నారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, యూపీ, రాజస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా ల్యాండ్ స్లైడ్స్, చెట్లు విరిగిపడి ఇప్పటివరకు 28 మంది మృతి చెందారని అధికారులు స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే గత 40 ఏండ్లలోనే రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. యమునా నది రెండు రోజుల్లో డేంజర్ మార్క్ ను దాటనుందని అధికారులు హెచ్చరించారు. By Shareef Pasha 10 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ప్రధాన నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన మరికొన్ని ప్రాంతాల్లో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. నార్త్ రైల్వేస్ పరిధిలోని 17 రైళ్లను రద్దు చేశామని, మరో 12 రైళ్లను దారి మళ్లించామని, నాలుగు చోట్ల ట్రాకులపై భారీగా వరద నీరు చేరడంతో ట్రైన్ల రాకపోకలను నిలిపివేశామని రైల్వే అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలతో అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలతో రోడ్లు, ఇండ్లు నీట మునిగాయి. రాష్ట్రమంతటా దాదాపుగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. రెండు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.పెద్ద నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గడిచిన 36 గంటల్లోనే 14 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, 13 చోట్ల ఆకస్మిక వరదలు వచ్చాయని, 700 రోడ్లు బంద్ అయ్యాయని అధికారులు వెల్లడించారు. మనాలిలో షాపులు, వెహికల్స్ వరద నీటిలో కొట్టుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని వికాస్‌నగర్ సమీపంలో హిమాచల్ ప్రదేశ్ రోడ్‌వేస్ బస్సు వరదల్లో చిక్కుకుపోయింది. స్థానికుల సాయంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాల కారణంగా పలువురు మృతి ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఆదివారం ఐదుగురు మృతి చెందారు. తెహ్రీ గర్వాల్ జిల్లాలో 11 మంది యాత్రికులు ప్రయాణిస్తున్న జీపుపై కొండచరియలు విరిగిపడటంతో ఆ వెహికల్ గంగా నదిలో పడిపోయింది. జీపులో నుంచి ఐదుగురు వ్యక్తులను కాపాడామని, ముగ్గురి డెడ్ బాడీలను రికవరీ చేశామని అధికారులు వెల్లడించారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. జీపులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్లను ఢిల్లీ, బీహార్, హైదరాబాద్ కు చెందినవారిగా గుర్తించామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లోనూ ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. బలియా జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు చనిపోయారు. మరోచోట పిడుగుపాటుకు ముగ్గురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కాగా, కౌశాంబి ఏరియాలో వర్షాలు, ఈదురుగాలులకు చెట్టు విరిగి రేకుల షెడ్డుపై పడటంతో పదేండ్ల బాలిక చనిపోయిందని తెలిపారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లోనూ ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. 40 ఏండ్ల తరువాత ఢిల్లీలో అత్యధిక వర్షపాతం నమోదు ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 40 ఏండ్లలోనే అత్యధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది. సఫ్దర్ జంగ్ అబ్జర్వేటరీలో ఆదివారం ఉదయం 8.30 వరకు గడిచిన 24 గంటల్లో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. ఢిల్లీలో జులై 25, 1982న 24 గంటల్లో 169.9 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, ఆ తర్వాత ఇదే అతి భారీ వర్షమని తెలిపింది. కుండపోత వర్షాల కారణంగా రోడ్లు, అండర్ పాస్ లు, మార్కెట్లు, పార్క్ లు, వీధులన్నీ నీట మునిగిపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి