Nara Lokesh: 'జే' టాక్స్ పేరుతో ప్రజల జేబులు దోచుకుంటున్నాడు.. జగన్ టార్గెట్‌గా లోకేశ్ ఫైర్! టీటీడీ పాలకమండలిలో చాలా మంది అవినీతిపరులు ఉన్నారని.. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మసి అయిపోతారని సీఎం జగన్‌పై విమర్శలు చేశారు నారా లోకేశ్. యువగళం పాదయాత్రలో భాగంగా జంగారెడ్డి గూడెంలో లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లోకేశ్ చెప్పారు. న్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 20వేల రూపాయలు ఇస్తామన్నారు. By Trinath 30 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సీఎం జగన్ టార్గెట్‌గా నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. మూడు రాజధానులు అన్నారని... మూడు రాళ్ళు కూడా వెయ్యలేదంటూ మండిపడ్డారు. చంద్రబాబు స్థాయి పోలవరం ప్రాజెక్ట్ అయితే ... జగన్ స్థాయి మురికి కాలువ అని నిప్పులు చెరిగారు లోకేశ్. జగన్ ది దరిద్రపు పాలనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భగవంతుడుతో పెట్టుకుంటే నాశనం అయిపోతారని.. తిరుమల కొండని దోచేశారంటూ ఆరోపించారు. జంగారెడ్డి గూడెంలో నారా లోకేష్ కామెంట్స్.. - టీటీడీ పాలకమండలిలో చాలా మంది అవినీతిపరులు. - వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుంటే మసి అయిపోతారు. - జగన్... నీ కన్న తల్లి , సొంత చెల్లి నిను నమ్ముతారా . - సైకో జగన్ ఆంధ్రా లో అడుగుపెడితే వైయస్సార్ కాళ్లు విరకొడతా అన్నారు. - జగన్ను ఆయన కుటుంబ సభ్యులే నమ్మట్లేదు. - జగన్ ప్రతి రోజు ప్రజల రక్తం తాగుతున్నారు. - జె టాక్స్ పేరుతో ప్రజల జేబులు దోచుకుంటున్నాడు . - జే బ్రాండ్లు అంటే లిక్విడ్ పాయిజన్... ఈ మందు తాగితే లిక్కర్ కి చిల్లు పడుతుంది. - సైకో జగన్... అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మస్టార్. - జగన్ కు రెండు బటన్లు ఉన్నాయి. - పథకాల పేరుతో పది రూపాయలు ఇచ్చి... రేట్లు పెంచి వందల రూపాయలు బాదుతున్నాడు. - రానున్న రోజుల్లో పీల్చే గాలిపై కూడా పని వేస్తాడు. - భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్. - ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశాడు. - తెలుగు మహిళల బాధలు తెలుసుకున్నా... మీ కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది. - మహానాడులో భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మహిళల కోసం చంద్రబాబు నాలుగు పథకాలు ప్రకటించారు. - టిడిపి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు. - పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. రైతుల కోసం ఏం చేస్తామంటే? రైతుల ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉందని.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు లొకేశ్. రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే వాటిని రైతులు పగలగొట్టాలని మీకు అండగా టీడీపీ నిలబడుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 20వేల రూపాయలు ఇస్తామని చెప్పారు లోకేశ్. ఎస్,సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లాగా , బీసీల కోసం ఒక అట్రాసిటీ చట్టం తీసుకొస్తామన్నారు. కుల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి రుణాలు కేటాయిస్తామని చెప్పారు. ఎస్సీల కోసం నిలిపివేసిన 26 పథకాలను పునరుద్ధరిస్తామన్నారు. గిరిజనులకు రద్దు చేసిన 16 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి