నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు ఇవే.!

రేపటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిన నారా లోకేశ్ యువగళం పున:ప్రారంభం కానుంది. పాదయాత్రకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లారాజోలు మండలం పొదలాడ నుంచి సోమవారం పాదయాత్ర మళ్లీ మొదలుకానుంది.

New Update
నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు ఇవే.!

Nara Lokesh Yuvagalam: రేపటి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిన నారా లోకేశ్ యువగళం పున:ప్రారంభం కానుంది. పాదయాత్రకు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సెప్టెంబర్ 9న పాదయాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. తిరిగి దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ యాత్ర మళ్లీ మొదలు కానుండడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.  అంబేద్కర్ కోనసీమ జిల్లారాజోలు మండలం పొదలాడ నుంచి సోమవారం యువగళం పాదయాత్ర 2 పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం నారా లోకేశ్ ఆదివారం సాయంత్రమే అక్కడికి చేరుకోనున్నారు.

లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు :

ఉదయం :10.19 – రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
11.20 – తాటిపాక సెంటర్ లో బహిరంగసభ, యువనేత లోకేష్ ప్రసంగం.
12.35 – పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం, నగరంలో గెయిల్, ఓఎన్జిసి బాధితులతో ముఖాముఖి.
2.00 – మామిడికుదురులో స్థానికులతో సమావేశం.
2.45 – పాశర్లపూడిలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – అప్పనపల్లి సెంటర్ లో స్థానికులతో సమావేశం.
5.30 – అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ.
6.30 – బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి.
7.30 – పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటీ.
7.45 – పేరూరు శివారు విడిది కేంద్రంలో బస.

Also read: జర్నలిస్టు సౌమ్య హత్య కేసు.. అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
తాజా కథనాలు