Nara Lokesh: విద్యాకమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదు.. అధికారులకు మంత్రి లోకేష్ హెచ్చరిక..! విద్యాకమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత పెంచాలన్నారు. ప్రత్యేకమైన యాప్ ద్వారా విద్యాకమిటీల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. పెండింగ్ లో ఉన్న ఆయాల జీతాలు, కెమికల్ బిల్స్ చెల్లిస్తామని చెప్పారు. By Jyoshna Sappogula 30 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Nara Lokesh: విశాఖపట్నం జిల్లా భీమిలిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతి క్లాస్ రూమ్ ను సందర్శించి అక్కడ పాఠ్యాంశాల బోధన, సౌకర్యాలపై విద్యార్థినులను ఆరా తీశారు. వెలుపల చెప్పులు వదిలి మంత్రి క్లాస్ రూమ్స్ ను సందర్శించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం పాఠశాలలో ఏర్పాటుచేసిన రెమిడియల్ క్లాస్ రూమ్ ను మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ను పరిశీలించారు. లోకల్ ఫర్ వోకల్ పేరుతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను మంత్రి లోకేష్ సందర్శించారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయడమే తమ లక్ష్యమని విద్యార్థినులు తెలిపారు. కెజిబివిలో బోధనా పద్ధతులు, సౌకర్యాలను ప్రిన్సిపాల్ కుమారి గంగ మంత్రికి వివరించారు. మంత్రి దృష్టికి విద్యార్థినుల సమస్యలు స్కూలు డార్మెటరీని మంత్రి లోకేష్ సందర్శించారు. అక్కడ సౌకర్యాలపై విద్యార్థినులను ఆరా తీశారు. విద్యార్థినులు సమస్యలు చెబుతూ తమకు ల్యాబ్ కెమికల్స్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు కల్పంచాలని కోరారు. స్కూలుకు వచ్చే అప్రోచ్ రోడ్డు సరిగా లేదని., రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. క్రికెట్ లో గుజరాత్ వెళ్లి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నామని విద్యార్థినులు చెప్పగా, మంత్రి లోకేష్ వారిని అభినందించారు. ఇకపై రాష్ట్రంలో ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ మీట్, సైన్స్ ఫేర్ నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థినులకు అవసరమైన క్రీడా పరికరాల కిట్స్ కూడా అందజేస్తామని తెలిపారు. భీమిలి కస్తూరిబా స్కూలులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని.. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. Also Read: జగన్ కు ఊహించని షాక్.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఔట్! విద్యాకమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలి ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాల మెరుగుదల, సౌకర్యాల కల్పనలో విద్యా కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ కోరారు. భీమిలి కెజిబివి స్కూలు విద్యాకమిటీ సభ్యులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్కూళ్లను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, విద్యాకమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదని హెచ్చరించారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత పెంచాలన్నారు. ప్రత్యేకమైన యాప్ ద్వారా విద్యాకమిటీల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. డింగ్ లో ఉన్న ఆయాల జీతాలు, కెమికల్ బిల్స్ చెల్లిస్తామని చెప్పారు. #nara-lokesh #tdp #ap-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి