Nara Lokesh: గజదొంగ జగన్ కావాలో.. విజనరీ లీడర్ చంద్రబాబు కావాలో తేల్చుకోండి: లోకేష్ వైసీపీ సర్కారుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మరోసారి మండిపడ్డారు. జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం అయిందని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డిది దరిద్ర పాదమని విమర్శించారు. అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ ఫొటో షేర్ చేశారు. By Jyoshna Sappogula 10 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Nara Lokesh: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ది దరిద్రపాదం అంటూ పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారని కామెంట్స్ చేశారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా రాయదుర్గం నియోజకవర్గం మాల్యం గ్రామంలో సాగునీరు లేక బీడువారిన పొలాలు, గతుకుల రోడ్లు చూసి చలించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. Also Read: దేవుడికి పూజలు ఎందుకు చేయాలి.. బిగ్ బాస్ ఫేమ్ కీర్తి షాకింగ్ కామెంట్స్ జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం! జగన్ ది దరిద్రపాదం. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా రాయదుర్గం నియోజకవర్గం మాల్యం గ్రామంలో సాగునీరు లేక బీడువారిన పొలాలు,… pic.twitter.com/lBqTx4rbto — Lokesh Nara (@naralokesh) March 10, 2024 ప్రజల కష్టాలను గాలికొదిలేసి.. ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ ల పేరుతో ప్రజల రక్తాన్ని తాగుతున్న జగన్ రాయలసీమ బిడ్డ కాదని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని ధ్వజమెత్తారు. అయిదేళ్ల పాలనలో పట్టుమని పదెకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థుడని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లక్షలాది సీమ రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమేగాక కరువు సీమలో కార్లపంట పండించిన అపర భగీరథుడు మన చంద్రన్న అని దుయ్యబట్టారు. గజదొంగ జగన్ కావాలో, విజనరీ లీడర్ చంద్రబాబు కావాలో తేల్చుకోవాల్సింది విజ్ఞులైన సీమ ప్రజలేనని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. #nara-lokesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి