Nara Bhuvaneshwari: బెదిరింపులకు భయపడేదే లేదు.. సీఐడీకి నారా భువనేశ్వరి సవాల్.. తిరుపతిలో 'నిజం గెలవాలి' కార్యక్రమంలో నారా భువనేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు. తమపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. ఎలాంటి విచారణనైనా చేసుకోండి.. సీఐడీ బెదిరింపులకు భయపడేదే లేదంటూ సీఐడీకే సవాల్ విసిరారు భువనేశ్వరి. జీవితంలో సమస్యలు మామూలేనని అన్న భువనేశ్వరి.. త్వరలోనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. By Shiva.K 26 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Nara Bhuvaneshwari: "తండ్రి ఎన్టీఆర్ నుంచి పౌరుషాన్ని నేర్చుకున్నా.. చంద్రబాబు నుంచి క్రమశిక్షణ, ఓర్పు నేర్చుకున్నాను.. సీఐడీ బెదిరింపులకు భయపడే లేదు.. సీఐడీకి సవాల్ విసురుతున్నా.. మాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. ఎలాంటి విచారణనైనా చేసుకోండి" అంటూ తిరుమల వేదికగా సంచలన కామెంట్స్ చేశారు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. గురువారం నాడు తిరుపతిలో 'నిజం గెలవాలి' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె.. ఊహించని రీతిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తిరుమలకు ఎప్పుడూ కుటుంబ సమేతంగా వెళుతుండేవాళ్ళమని.. తొలిసారి తాను ఒక్కదానినే తిరుమలకు వెళ్లానని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో సమస్యలు మామూలేనని అన్న భువనేశ్వరి.. త్వరలోనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి ఇంకా ఏమన్నారంటే.. " సీఐడీకి సవాల్ విసురుతున్నా.. మాపై ఎలాంటి విచారణనైనా చేసుకోండి. చంద్రబాబు పడిన కష్టాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. చంద్రబాబు కోసం మహిళలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. అరెస్టులు చేస్తున్నా మహిళలు భయపడడం లేదు. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు రాసిన లేఖపై ప్రభుత్వం ఎంక్వయిరీ వేయడం విడ్డూరంగా ఉంది. పనికిమాలిన ఎంక్వయిరీలు ఎందుకు? పిచ్చిపిచ్చి ఆలోచనలు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ప్రభుత్వంలో ఏమాత్రం లేదు. జీవితంలో సమస్యలు మామూలే. త్వరలో మా కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది." అని విశ్వాసం వ్యక్తం చేశారు భువనేశ్వరి. ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. "ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదటగా వెంకటేశ్వరస్వామిని గుర్తు తెచ్చుకుంటాం. తిరుమలకు ఎప్పుడూ కుటుంబ సమేతంగా వెళుతుండేవాళ్ళం. మొదటిసారి నేను ఒక్కదానినే తిరుమలకు వెళ్లాను. చంద్రబాబు జైలుకు వెళ్లి 48 రోజులవుతోంది. తిరుమలలో నిత్యన్నదానాన్ని తీసుకువచ్చింది చంద్రబాబు. రాష్ట్రంలో ఎన్నో పుణ్యక్షేత్రాలను చంద్రబాబు అభివృద్ధి చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ హబ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉండేది. 2014 నుంచి ఎన్నో పరిశ్రమలను ఏపీకి తీసుకువచ్చారు. వైసిపి అధికారంలోకి వచ్చిందే ఆలస్యం.. చాలా వరకు పరిశ్రమలు ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. పారిశ్రామిక వేత్తలను ఏపీలో ఇబ్బందులకు గురి చేశారు. ఒక విజన్‌తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు. నాలుగున్నర సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ అయినా రాష్ట్రానికి వచ్చిందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించండి." అని అన్నారు భువనేశ్వరి. "తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలోనే చంద్రబాబు విద్యాభ్యాసం చేశారు. రాజకీయ ఒనమాలు నేర్చుకుంది తిరుపతిలోనే. చంద్రబాబు అరెస్టుపై తిరుపతిలో ఆందోళన చేసిన జనసేన- టిడిపి నాయకులను అరెస్టు చేయడం దారుణం. ఆంధ్రప్రదేశ్ అంటే అరెస్టులు, కేసులు, జైలుకు పంపించడం తప్ప ప్రజాస్వామ్యం అనేదే లేదు. సీఐడీ బెదిరింపులకు భయపడేది లేదు. సీఐడీకి సవాల్ విసురుతున్నా.. మాపై ఎలాంటి విచారణనైనా చేసుకోండి. క్రమశిక్షణగా ఉండడం.. క్రమశిక్షణ నేర్పించడం చంద్రబాబుకు తెలుసు. రాజమండ్రి జైలుకు ములాఖత్ వెళ్ళినప్పుడు చంద్రబాబు ధైర్యంతో ఉన్నారు. ఎప్పుడు ములాఖత్ కు వెళ్లినా టిడిపి కార్యకర్తలు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. నారా లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఎన్నికల సమయం సమీపిస్తోంది.. మీ ఓటును ఆలోచించి వేయండి." అని నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదికూడా చదవండి: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్! #andhra-pradesh #chandrababu-naidu #chandrababu #chandhra-babu-arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి