తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.
గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..
ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)