దానికి మాకు సంబంధం లేదు: టీఎఫ్‌సీసీ

వచ్చే నెల దుబాయ్‌ లో నిర్వహిస్తున్న నంది అవార్డుల వేడుకకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి ఎలాంటి సంబంధం లేదని టీఎఫ్‌సీసీ ప్రకటించింది. దుబాయ్‌ లో నిర్వహిస్తున్న వేడుక ఓ వ్యక్తికి సంబంధించినది. అది పూర్తిగా సొంత వేడుక కావడం వల్ల మేము ఆ వేడుకలో కూడా పాల్గొనడం లేదని టీఎఫ్‌సీసీ వివరించింది.

New Update

ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఏపీ స్టేట్ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.

సెప్టెంబర్‌ 24న దుబాయ్‌లో నిర్వహించబడే టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి తెలుగు, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌లకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఈవెంట్‌లో మేం భాగం వహించము. ఇది తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ పి. రామకృష్ణ గౌడ్‌ నిర్వహించే వ్యక్తిగత , ప్రైవేట్‌ ఈవెంట్‌.

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ర్టీకి మాతృసంస్థ, మరియు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తించబడిన సంస్థలు అని మరోసారి తెలియజేస్తున్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఛాంబర్‌ కాదు.

నంది అవార్డు అనేది ఆంధ్ర రాష్ట్రానికి పేటెంట్‌ అయినందున, నంది అనే పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నాము.

ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫ్‌సీసీ నంది అవార్డుల ఈవెంట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని అందరికీ తెలియజేస్తున్నాం అని టీఎఫ్‌సీసీ పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు