బాలయ్య  NBK 109 సంక్రాంతి  ట్రీట్ ?

బాలకృష్ణ -డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతోన్నnbk109 సినిమా సంక్రాంతి ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎన్నోఆశలు పెట్టుకున్నారు . గతేడాది వీర సింహా రెడ్డితో అలరించిన బాలయ్య..ఈ ఏడాది 109 అప్డేట్తో పండగ పూట లాస్ట్ మినిట్ లోనైనా ట్రీట్ ఇస్తారని ఆసక్తి ఎదురుచూస్తున్నారు.

New Update
బాలయ్య  NBK 109 సంక్రాంతి  ట్రీట్ ?

NBK 109 UPDATE : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Balakrishna)వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. బాలకృష్ణ – డైరెక్టర్ బాబి (Boby)కాంబోలో తెరకేక్కుతోన్న పవర్ ఫుల్ యాక్షన్ మూవీ అప్డేట్స్ కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి అందరి స్టార్ హీరోల నుంచి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది,

సంక్రాంతికి అలరించిన స్టార్స్ .. ఒక్క బాలయ్య , చిరు తప్ప

స్టార్ హిరోలయిన (Chiranjeevi)చిరంజీవి ,(Balakrishan)బాలకృష్ణ నుంచి మాత్రమె రాలేదు. అయితే .. ఈ లోటుని బర్తీ చెస్తూ చిరు తన (Mega156)మెగా 156 మూవీ టైటిల్ ఈ రోజు రిలిజ్ చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. ఈ అప్డేట్తో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. వశిష్ట దర్సకత్వంలో తెరకేక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రణాళికలు రచిస్తున్నారు మేకర్స్. ఈ క్రమం లోనే బాలయ్య బాబు 109 మూవీ(NBK 109) నుంచి అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురుచుసారు. అయితే ఇంతవరకు ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. మెగా స్టార్ సినిమా అప్డేట్ లా సడన్ సర్ప్రైజ్ ఇస్తారేమోనని అంతా క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ:సంక్రాంతి కానుకగా మెగాస్టార్ 156 మూవీ టైటిల్ రేపే రిలీజ్..టైటిల్ ఇదే ..!!

NBK 109 పోస్టర్ కు అల్టిమేట్ రెస్పాన్స్

గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి ,దసరాకు భగవంత్ కేసరి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న  బాలయ్య ఇపుడు తన ఫోకస్ అంతా బాబి దర్సకత్వంలో చేస్తున్న సినిమాపైనే పెట్టాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి షూటింగ్ స్టార్ట్ అప్పట్లో రిలీజ్ చేసిన పోస్టర్ కు అల్టిమేట్ రెస్పాన్స్ రావడంతో ఈ సారి బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టడం ఖాయమని అర్దమయిపోయింది.

బాలయ్య బాబు కెరీర్ లో గూస్ బంప్స్ పుట్టించే యాక్షన్ సీన్స్

వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో ఎన్బీకే 109 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో గూస్ బంప్స్ పుట్టించే యాక్షన్ సీన్స్  ఉంటాయని ,ఈ సన్నివేశాలు బాలయ్య బాబు కెరీర్ లో ఇదివరకెన్నడు చెయ్యని విధంగా ఉంటాయని తెలుస్తోంది.ఇక.. ఈ 109 చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లో కాని విజయధశమికి కానీ రిలీజ్  చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ తెలిపారు.

ALSO READ:Ram Charan Tej: దోశలు చేసిన రామ్ చరణ్.. ఫొటోలు వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు