Balakrishna: కేబినెట్ లో బాలయ్య.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ విజయం అందుకున్న బాలకృష్ణకు మంత్రి పదవి దక్కడం ఖాయమంటూ ప్రచారం సాగుతోంది. పార్టీలో సీనియర్ కావడం, ఎన్టీఆర్ కుమారుడు ఇలా అన్ని అంశాలు ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

New Update
Balakrishna: కేబినెట్ లో బాలయ్య.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

Balakrishna To Be Cabinet Minister: ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి కేంద్రంలో ఎన్డీఏ కూటమి సమావేశాలు, ప్రమాణ స్వీకారం, రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొనడం తదితర కార్యక్రమాలతో చంద్రబాబు (Chandrababu) నిన్న రాత్రి వరకు బిజీగా ఉన్నారు. నిన్న మోదీతో పాటు కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం ముగియడంతో చంద్రబాబు ఈ రోజు విజయవాడకు చేరుకున్నారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. దీంతో ఆయన కేబినెట్ లోకి ఎవరిని తీసుకుంటారు? కాబోయే మంత్రులు ఎవరు? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. హిందూపూర్ నుంచి వరుసగా మూడు సార్లు విజయం అందుకున్న బాలకృష్ణకు మంత్రి పదవి దక్కడం ఖాయమంటూ ప్రచారం సాగుతోంది.

పార్టీలో సీనియర్ కావడం, ఎన్టీఆర్ కుమారుడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మాస్ ఇమేజ్, సేవా కార్యక్రమాలు ఇలా అన్ని అంశాలు ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. లోకేష్‌ను (Nara Lokesh) మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అయితే.. 2014లోనే చంద్రబాబు కేబినెట్లో బాలయ్యకు ఛాన్స్ పక్కా అన్న ప్రచారం సాగింది. అయితే.. ఆ సమయంలో చంద్రబాబు ఓకే చెప్పినా.. బాలకృష్ణ మంత్రివర్గంలో చేరడానికి అంతగా ఆసక్తి చూపలేదన్న టాక్ నడిచింది. అయితే.. ఈ సారి మాత్రం బాలయ్య చంద్రబాబు మంత్రివర్గంలో చేరడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read: ఇండస్ట్రీలో ఆ రికార్డులు క్రియేట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో బాలయ్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు