Bala Krishna: జగన్ పై నందమూరి బాలకృష్ణ పంచ్ డైలాగులు..! హిందూపురంలో సీఎం జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ పంచ్ డైలాగులు వేశారు. ఎన్నికల్లో జగన్ ను మట్టిలో కలిపేస్తామన్నారు. 'నా దళితులంటునే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తాడు. నాయకుడు అంటూనే నయవంచకుడిగా మారాడు.. అక్కచెల్లెళ్ల ఉసురు పోసుకుంటున్నాడు' అని దుమ్మెత్తిపోశారు. By Jyoshna Sappogula 25 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Bala Krishna: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం బాలంపల్లి గ్రామంలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన పంచ్ డైలాగులతో కార్యకర్తల్లో జోష్ నింపారు. నా దళితులంటూనే... 'నా అక్క చెల్లెలు అంటునే అక్కచెల్లెళ్ల ఉసురు పోసుకుంటున్నాడు.. జగన్ .. నా దళితులంటాడు.. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తాడు.. నాయకుడు అంటూ నయవంచకుడిగా మారాడు'.. జగన్ నేనున్నానంటూ ఎంత దగా మోసం క్రూరత్వం చూపించాడో అందరికీ తెలుసున్నారు. Also Read: తిరుపతిలో ఉద్రికత్త.. వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోటా పోటీ..! దేనికి సిద్ధం.. ప్రజాధనం 16 వేల కోట్లతో ఎక్కడ చూసినా నేను సిద్ధం అంటూ జగన్ హోల్డింగ్ లు పెట్టుకున్నాడని..అయితే, జగన్ దేనికి సిద్ధమంటూ వ్యంగాస్త్రాలు విసిరారు బాలయ్య. గులకరాయ్ వేయించుకోవడానికా సిద్ధం అంటూ కౌంటర్ వేశారు. సమర్థవంతమైన పాలన కావాలా, రాక్షసుడి పాలన కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. ఎన్నికల్లో జగన్ ను మట్టిలో కలిపేస్తామన్నారు. దుర్మార్గపు పాలన.. యువతకు ఉపాధి లేక నిరాశ నిస్పృహతో గంజాయి డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారన్నారు. ఈ కూటమి నిప్పులా ఉప్పెన, ఈ కూటమన్నది ఒక అగ్నిపర్వత విస్పోటనం, ఒక పాష పదార్థం.. నేను ఒంటరి వాడిని అంటున్నాడు.. తల్లిని, చెల్లిని బయటకు నెట్టేసి ఎవరు ఒంటరోడు అవమన్నాడని ప్రశ్నించారు. ఎస్సీల మీద దాడులు, అత్యాచారాలు, మానభంగాలు ఎక్కువ అయ్యాయన్నారు. దుర్మార్గపు పాలనకు ఓటు రుచి ఎలా ఉంటుందో చూపించాలన్నారు. #cm-jagan #nandamuri-balakrishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి