/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/47000951_725559941170676_3395613565263020032_n-jpg.webp)
తెలంగాణలో కాంగ్రెస్ (TS Congress) పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి (Nagam Janardhan Reddy) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నాగంను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని కేటీఆర్ ఈ సందర్భంగా ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు ఉదయమే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడి.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తాజా నాగం జనార్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగడం కాంగ్రెస్ నేతలను కలవరానికి గురి చేస్తోంది.
ఇది కూడా చదవండి:TS Politics: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ గూటికి ఎర్ర శేఖర్!
నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే.. బీఆర్ఎస్ నుంచి ఇటీవల చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయానికి వచ్చారు.
ఇది కూడా చదవండి:TS Politics: బీజేపీకి మరో బిగ్ షాక్.. ఫామ్​హౌస్​లో వివేక్, రేవంత్ రెడ్డి చర్చలు?
దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగంతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow Us