AP: డీలర్లుకు మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు..!

రైతును మోసం చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా డి.ఎ.పి., యూరియా తూనికలు, ధరల్లో తేడాలు లేకుండా డీలర్లు చూసుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తాయని తెలిపారు.

New Update
AP: ఇలా ఉండటం బాధాకరం.. ఇకపై ఈ పరిస్థితి ఉండదు:  మంత్రి నాదెండ్ల

Nadendla Manohar: 'కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ప్రతి అడుగులో రైతుని ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేస్తుంది. రైతుకి భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తుంద'ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగు మందుల తయారీదార్లు, డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యూరియా, డి.ఏ.పి., ఎరువులు, పురుగు మందుల అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కొలతలు, ధరల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బరువు, ఎమ్మార్పీల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జనవరి నుంచి అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైస్ నిబంధనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

తూనికలు, కొలతల శాఖ జాయింట్ కంట్రోలర్ బి. రామ్ కుమార్ తూనికలు, కొలతల శాఖలో కొత్తగా వచ్చిన చట్టాలు, నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ "కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుకి ఎక్కడా ఇబ్బంది కలుగకుండా, అన్నదాతకు భరోసా కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నాం. ధాన్యం సేకరణ దగ్గర నుంచి కనీస మద్దతు ధర పకడ్బందీగా ప్రతి రైతుకీ అందించే విధంగా ఈ ఖరీఫ్ సమయానికి సిద్ధం అవుతున్నాం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ నిర్వహించిన తనిఖీల్లో యూరియా, డీఏపీ ధరలు, కొలతల్లో తేడాలు, బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులకు ఇబ్బంది కలుగుతున్న విషయం దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల దుకాణాల వద్ద ఎంఆర్పీని రౌండ్ ఫిగర్ చేసి అమ్ముతున్నారు. రైతులు ఎంత కష్టపడి పంట పండిస్తున్నారో అందరికీ తెలుసు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధర తీసుకోవడం అంటే మోసం చేస్తున్నారన్న భావన రైతుల్లో కలుగుతుంది.

Also Read: శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

252 కేసులు నమోదు తూనికలు, కొలతల శాఖ నుంచి ఇటీవల క్షేత్ర స్థాయిలో చేపట్టిన తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా 252 కేసులు నమోదు చేశాం. అందులో ఎక్కువ కేసులు కొలతల్లో తేడాలు ఉన్నాయని పెట్టినవే ఉన్నాయి. రైతుని ఇబ్బంది పెట్టే విధంగా కొలతల్లో తేడాలు చేస్తే ఉపేక్షించేది లేదు. ఒక్కోచోట బస్తాకి రెండు, మూడు కేజీలు తేడాలు ఉంటున్నాయి. కొలతల విషయంలో తేడాలు ఉండకూడదు. ప్రతి బ్యాగు బరువు చూసి అమ్మాలి. మరికొన్ని అధిక ధరల వసూళ్లకు సంబంధించిన కేసులు ఉన్నాయి. రవాణాలో బరువు తగ్గితే ఉన్న కొలత లెక్క కట్టి దాని మేరకే ధర చెల్లించే ఏర్పాటు చేయాలి. ఎక్కడా రైతుకి మాత్రం ఇబ్బంది కలుగ కుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

గత ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులుపడ్డారు. ఎరువులు, విత్తనాల కొరత ప్రధానంగా రైతుని ఇబ్బందిపెట్టింది. మన ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి నెలా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించి రైతుల పక్షాన నిలబడతాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తాయి. మారిన చట్టాలకు అనుగుణంగా అంతా ముందుకు వెళ్లాలి. కొత్తగా అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైస్ నిబంధనను తయారీదార్లు కచ్చితంగా అమలు చేయాలి. అదే సమయంలో తయారీదార్లు క్షేత్ర స్థాయిలో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా దృష్టి సారించాలి. తయారీదార్లు, డీలర్లకి కొత్త చట్టాల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. రైతుకి భరోసా కల్పించకపోతే మనం తప్పు చేసిన వారిమవుతాము.

రైతు సంతోషమే మన సంతోషం
మా ప్రభుత్వం ఎల్లవేళలా వినియోగదారుడి పక్షాన నిలబడుతుంది. రైతు సంతోషంగా ఉంటేనే మనమంతా సంతోషంగా ఉంటాము. సరుకు కొరత వల్ల బ్లాక్ మార్కెట్ జరుగుతోందని చెబుతున్నారు. మనం మంచి చేయాలి అనుకుంటే ఎలాగైనా చేయొచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు ధరల్ని నియంత్రించిన విధానం అందుకు ఉదాహరణ. కంది పప్పు కేజీ రూ.180 ఉన్నప్పుడు హోల్ సేలర్స్, రిటెయిలర్స్ తో సమావేశం ఏర్పాటు చేస్తే మొదట రూ.160కి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మరో రూ.10 తగ్గించి రూ.150కి కేజీ ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. తయారీదార్లు, డీలర్లు రైతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలి'. అని సూచించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్క్ శంకర్‌ను కాపాడిన సింగపూర్ స్కూల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. పవన్‌‌తో మోదీ మాట్లాడి.. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

author-image
By K Mohan
New Update
PM modi pK

PM modi pK Photograph: (PM modi pK)

సింగపూర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారిక సమాచారాన్ని వెల్లడించారు. ప్రధాన మంత్రి మోదీ కూడా పవన్ కళ్యాన్‌కు ఫోన్ చేసి మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రమాదం గురించి, బాబు ఆరోగ్య పరిస్దితి గురించి మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ప్రమాదంలో పవన్‌ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి 7గంటలకు ఫ్లైట్‌లో సింగపూర్ బయలుదేరనున్నారు.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

స్కూల్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్‌ను కాపాడిన సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడికి చికిత్స కొనసాగుతోందని జనసేన లీడర్ తెలిపారు. జరిగిన ప్రమాదంపై పవన్‌ కళ్యాణ్‌తో మోదీ మాట్లాడారని ఆయన చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాని మోదీ చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Also read: Dubai Crown Prince: ఢిల్లీకి చేరుకున్న అత్యంత సంపన్నుడు దుభాయ్ రారాజు.. ఎందుకంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు