Nadendla Manohar: ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభకోణం.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల స్కామ్‌ జరిగితే.. డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని నాదెండ్ల మనోహార్‌ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు..ఎన్ని కేసులు వచ్చాయో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుంభకోణాలపై చర్యలు తీసుకుంటామని నాదెండ్ల తెలిపారు.

New Update
Nadendla Manohar: ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభకోణం.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు

Nadendla Manohar: ఏపీలో జరుగుతున్న అవినీతిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎన్నికల ప్రచారంలో 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క రూపాయి అవినీతి జరగలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. రోజు మీడియాలో వస్తున్న అవినీతి వార్తలకు సమాధానం చెప్పాలని జగన్‌ ప్రభుత్వానికి ఆయన సవాల్‌ చేశారు. అవినీతి నిరోధక శాఖలో టోల్ ఫ్రీ నెంబర్ 14400కు.. 8,03,612 ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2,16,803 ఫిర్యాదులు మంత్రులు, పేషీలపై వచ్చాయని తెలిపారు. 4,39,679 ఎమ్మెల్యే లపై వచ్చిన అవినీతి ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారో..?  చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బదిలీల్లో కోట్ల రూపాయల కుంభ కోణం:

ఏటా ఫిర్యాదులపై మీడియాకు చెప్పే అధికారులు.. గత కొంతకాలంగా వివరాలు ఎందుకు చెప్పడం లేదని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సీఎం సమీక్ష సమావేశంలో ఏసీబీ డీజీ ఎవరు? అనే అడిగే స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభ కోణం జరిగితే.. డీజీపీ వీటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు.. ఎన్ని కేసులు వచ్చాయో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అధికారంలోకి రాగానే కుంభ కోనాలపై చర్యలు:

ఇంత అవినీతి జరిగితే ప్రజలకు అబద్ధాలు చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. కొంత మంది చేతుల్లోనే పవర్స్ ఉన్నాయన్నారు. ఈసీ దీనిపై దృష్టి సారించాలని నాదెండ్ల మనోహార్ కోరారు. పవన్ కళ్యాణ్ ఈనెల 30 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. వచ్చే నెల 10 వరకు మొదటి విడతలో నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. తెనాలి, నెల్లిమర్ల, అనకాపల్లి, రాజోలు, రాజానగరంలో ఎన్నికల ప్రచారం ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుంభకోణాలపై చర్యలు తీసుకుంటామని నాదెండ్ల మనోహార్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఊర్లో తిరగనివ్వం.. కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!

ఒంటిమిట్టలో కొలువై ఉన్న సీతారాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ప్యాకింగ్‌తో సిద్ధం చేశారు.మొత్తం 70వేల లడ్డూలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

New Update
Tirupati Laddu

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల‌ కళ్యాణానికి వచ్చే భ‌క్తుల‌కు టీటీడీ తీపికబురు చెప్పింది. శుక్రవారం జరిగే కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రెడీ అయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ నిర్వహించారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్‌, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది తిరుమలలో శ్రీ‌వారి సేవ‌కులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు. 

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

 ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామ స్వామి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30  మధ్య  జరిగే  శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ఉచిత ప్రసాదంగా అందజేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటిమిట్ట లో ఈ నెల 11వ తేదీన జరుగనున్న రాముల వారి కల్యాణం ఏర్పాట్లను టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మంతో కలసి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. 

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

ఈ సందర్భంగా శుక్రవారం శ్రీకోదండరామ స్వామి కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నసందర్భంగా, ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహాం వద్ద ముఖ్యమంత్రి బస చేసే గదులలో ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ కోతలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలలో పచ్చదనం, పుష్పాలంకరణలు తాజా పుష్పాలతో ఏర్పాటు చేయాలన్నారు.

అటు తర్వాత టీటీడీ అతిథి గృహం నుంచి ఆలయం వరకు పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయంలోపుల ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో నిల్వ వున్న సామాగ్రి, వస్తువులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయం అంతా కలియ తిరిగారు. ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు విద్యుత్ కాంతులు, పుష్పలంకరణలలో రాజీ లేకుండా నాణ్యంగా పనులు చేపట్టాలని కోరారు. 

అధికారులు సమన్వయంతో జిల్లా యంత్రాంగం, టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. భక్తులు అందరికి అన్నప్రసాదాలు, స్వామివారి కళ్యాణ తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, త్రాగునీరు, మజ్జిక పంపిణీ చేస్తామని చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్లు జిల్లా రెవిన్యూ, పోలీసు, స్థానిక పంచాయతీ, టీటీడీ అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. 

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Also Read: Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!

kadapa | sita rama kalyanam at vontimitta | vontimitta kalyanam | vontimitta-kodandaram | vontimitta ramalayam | vontimitta sitarama kalyanam | vontimitta sita rama kalyanam | ttd | laddu

Advertisment
Advertisment
Advertisment