ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అనడానికి రీజన్ ఇదే..!

ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ అంటున్నది ఓట్ల కోసమో, సీట్ల కోసమో, వ్యక్తిగత స్వలాభం కోసమో కాదని.. కేవలం రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, రైతులు, మహిళల కోసమేనని అన్నారు జనసేన పీఏసీ నాదెండ్ల మనోహర్.

New Update
Nadendla: ఎవ్వరు తప్పు చేసినా క్రిమినల్ కేసులే.. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక..!

TDP- JSP: గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్లు చీలనివ్వను అని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఓట్ల కోసమో, సీట్ల కోసమో, వ్యక్తిగత స్వలాభం కోసమో కాదని వ్యాఖ్యనించారు. కేవలం రాష్ట్రం అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం, రైతులు, మహిళల కోసమేనని అన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు.. వైసిపి తప్ప వేరే ఏ పార్టీ ఉండకూడదని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం, పార్టీ శ్రేణులు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

Also Read: జగనన్న కాలనీ పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారు.!

రాష్ట్రంలో దుర్మార్గంగా ఆలోచించే వ్యక్తులు పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు నాదెండ్ల మనోహర్. అలాంటి దుర్మార్గులను ప్రాలద్రోలే వరకు అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. వ్యవస్థలను తొక్కి పాలన చేస్తామంటే దాన్నీ మేము చూస్తూ ఊరుకోవటానికి సిద్దంగా లేమని తేల్చి చెప్పారు. రైతులు రాజధాని కోసం 30వేల ఎకరాలు ఇస్తే ఒక కులానికి అంటగట్టి నాశనం చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. జనసేన, టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమేనని.. పేదలకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్దామని అన్నారు. ఇద్దరి కలయిక వల్ల రాష్ట్రం భవిష్యత్తు మారిపోతుందని సంక్షేమం అభివృద్ధితో ముందుకు దూసుకువెళ్తుందని ధీమ వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం కచ్చితంగా ఉందన్నారు.

Also Read: కాకరకాయ తిన్న తర్వాత ఈ పదార్థాలు తింటున్నారా..? అయితే జాగ్రత్త

మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం ఓట్లు చిలనివ్వను అన్న నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం అని వ్యాఖ్యనించారు. వ్యవసారంగాన్ని కూడా రాజకీయంగా చూస్తున్న దుర్మార్గపు వైసిపి పార్టీని..రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్ కోసం క్షేత్రస్థాయి నుంచి అందరూ కలిసి కట్టుగా పనిచేయాల్సిన సమయం ఆసన్నం అయ్యిందని పిలుపునిచ్చారు. పేదలకు ఇళ్ల పట్టలు ఇస్తున్నామన్న పేరుతో కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా జగన్ పై నిప్పులు చెరిగారు ఆలపాటి రాజేంద్రప్రసాద్. ఓట్లు చెల్లనివ్వను అన్న మాటలకు పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటావా నువ్వు ఎవరికి దత్తపుత్రుడివి అంటూ ఫైర్ అయ్యారు. న్యాయ మౌలిక సూత్రాలను అడ్డుపెట్టుకొని బయట తిరుగుతున్న దుర్మార్గపు వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు.18 కేసుల్లో ఛార్జ్ షీట్లు వేస్తే కనీసం కోర్ట్ ట్రైల్ కి కూడా వెళ్ళని వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు