Naa Saami Ranga: "చేసేయ్ చేసేయ్.. లేదంటే మాటొచ్చేత్తాది".. అంజి సందడి మొదలైంది

డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "నా సామిరంగ". తాజాగా "మా అంజి గాడిని పరిచయం చేస్తున్నాం.. లేదంటే మాటొచ్చేత్తాది" అంటూ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేస్తూ ఈ గ్లిమ్స్ విడుదల చేశారు.

New Update
Naa Saami Ranga: "చేసేయ్ చేసేయ్.. లేదంటే మాటొచ్చేత్తాది".. అంజి సందడి మొదలైంది

Naa Saami Ranga: అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా డైరెక్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం "నా సామిరంగ". శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇది. ఇటీవలే 'నా సామి రంగ' నుంచి మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. పల్లెటూరి యాసలో సాగిన ఈ పాటలో నాగార్జున, ఆషిక విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు.

"మా అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం (Anji Intro).. లేదంటే మాటొచ్చేత్తాది" అనే ఇంట్రడక్షన్ తో మొదలైంది. అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేస్తూ ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. 'నా సామి రంగ' సినిమాలో అల్లరి నరేష్ (Allari Naresh) అంజి పాత్రలో నాగార్జున సరసన కీలక పాత్రలో నటిస్తున్నారు. "చేసేయ్ చేసేయ్.. లేదంటే మాటొచ్చేత్తాది" అంటూ సందడి చేశారు అల్లరి నరేష్. గ్లిమ్స్ లో అల్లరి నరేష్, నాగార్జున విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో అల్లరి నరేష్ పాత్ర ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం అంజి ఇంట్రో గ్లిమ్స్ సోషల్ మీడియాలో  ట్రెండింగ్ లో సాగుతుంది.

Naa Saami Ranga

నాగార్జున నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ కథానాయికగా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి (MM Keeravani) ఈ సినిమాకు సంగీతం అందించగా, చంద్రబోస్ లిరిక్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో మరో సారి వీరిద్దరి కాంబోలో సూపర్ హిట్ పాటలు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట నెట్టింట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

Naa Saami Ranga

Naa Saami Ranga: "ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే పిల్ల".. నా సామిరంగ ఫస్ట్ లిరికల్ సాంగ్ 

Advertisment
Advertisment
తాజా కథనాలు