Manipur issue:మణిపూర్ లో మళ్ళీ మొదలైన హింస, నలుగురు కిడ్నాప్ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో హింస మొదలైంది. మధ్యలో కొంతకాలం పాటూ మైతీ ఉగ్రవాదులు ఏమీ చేయకుండా ఉన్నారు. కానీ తాజాగా నలుగురిని కిడ్నాస్ చేయడమే కాక కాల్పులను కూడా జరిపారు. By Manogna alamuru 08 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మణిపూర్‌లో మే నెలలో మొదలైన హింసాకాండ ఇంకా చల్లారడం లేదు. ఇక్కడ హింసతో దేశం మొత్తం ఆగమాగం అయింది. మణిపూర్ ప్రభుత్వం సైతం కఠిన చర్యలు తీసుకుంది. కానీ మైతీ ఉగ్రవాదులకు మాత్రం ఇవేమీ పట్టబడం లేదు. వాళ్ళు చేయాలనుకున్నది చేస్తూనే ఉన్నారు. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చేశారు. తాజాగా ఒక సైనికుని కుటుంబానికి చెందిన ముగ్గురితో సహా మొత్తం నలుగురిని కిడ్నాస్ చేశారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఇది జరిగింది. Also Read:గుడ్ న్యూస్…పండుగ ముందు తగ్గుతున్న బంగారం ధరలు కిడ్నాప్ వ్యవహారం అక్కడ కలకలం సృస్టించింది. మైతీ గ్రూప్ నలుగురిని ఎత్తుకెళ్ళిపోయారనే వార్త అంతటా వ్యాపించింది. దీంతో ఘర్షణలు చెలరేగాయి. ఇంఫాల్ వెస్ట్, కాంగ్‌పోక్పి, కాంగ్‌చుప్ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఒక సమూహంపై సాయుధ కుకీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక మహిళతో సహా మొత్తం ఏడుగురు గాయపడ్డారు. ఉగ్రవాదులు మొత్తం నలుగురిని కిడ్నాప్ చేశారు. ఇందులో 65 ఏళ్ళ వ్యక్తి కూడా ఉన్నట్టు సమాచారం. నెంగ్ కిమ్ (60), నీలం (55), జాన్ తుంగ్‌జామ్ హౌకిప్(25), జామ్‌ఖోటాంగ్(40) అనే వారు కిడ్నాప్ అయినట్టు పోలీసులు గుర్తించారు. మైతీ ఉగ్రవాదులు వీరిని ఎక్కడికి తరలించారనేది ఇంకా తెలియలేదు. వీరిని రక్షించేందుకు తమ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని కాంగ్‌పోక్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం ప్రభాకర్ తెలిపారు. Also Read:ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే.. యాప్ ద్వారా ఇలా ఫిర్యాదు చేయండి! మే నెలలో ఇద్దరు ఆడవారిని నగ్నంగా ఊరేగించడంతో మణిపూర్ లో అల్లర్లు చెలరేగాయి. అంతకు ముందు నుంచీ ఇవి నడుస్తున్నా ఈ సంఘటనతో దేశం మొత్తం దృష్టి ఈ రాష్ట్రం మీద పడింది. ఇప్పటికీ మైతీ ఉగ్రవాదులు చాలా మందిని కిడ్నాప్ చేయడమే కాక వారిని కిరాతకంగా చంపేశారు కూడా. #manipur #india #abducted #mythi-group మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి