నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ హ్యాక్ చేశారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అనుచరులైన కార్పొరేటర్లకు మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ లో నుంచి వారికి బెదిరింపు కాల్స్ రావడంపై ఆయన ఇలా స్పందించారు.

New Update
నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

BRS MLA Phone Hacked: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికలో మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ హ్యాక్ అయిందంటూ పేర్కొన్నారు. అసలు విషయం ఏంటంటే.. గత రెండు రోజులుగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అనుచరులైన కార్పొరేటర్లకు మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నుంచి బెదిరేరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో బెదిరింపు కాల్స్ వచ్చిన కార్పొరేటర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు.

ALSO READ: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ట్విట్.!

దీనిపై స్పందించిన ప్రస్తుత మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.. తన ఫోన్ హ్యాక్ చేసారని ఆరోపించారు. తాను ఎవరికి బెదిరింపు కాల్స్ చేయలేదని తేల్చి చెప్పారు. తనపై బురద రుద్దేందుకే కొందరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంత రావు పై మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. మర్రి రాజశేఖర్ రెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు అనే విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు