CAA: ముస్లింలు భయపడొద్దు.. ఇస్లాంను చట్టం రక్షిస్తుంది: కేంద్ర హోంశాఖ

CAA అమలుపై ఇండియాలో నివసించే ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇస్లాంను ఈ చట్టం రక్షిస్తుందని, హిందువులతో సమానంగా హక్కులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. వీదేశీయులు ఎవరైనా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

New Update
CAA: ముస్లింలు భయపడొద్దు.. ఇస్లాంను చట్టం రక్షిస్తుంది: కేంద్ర హోంశాఖ

Central Home Minister: పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై ఇండియాలో నివసించే ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. భారత్ లో ఉన్న 18 కోట్లమంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, హిందువులతో సమానంగా హక్కులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఇస్లాం పదానికి ముప్పు..
ఈ మేరకు 'పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌.. ఈ మూడు ముస్లిం కంట్రీల్లో మైనారిటీలు పీడనకు గురి కావడం వల్లే ఇస్లాం అనే పదానికి ముప్పు ఏర్పడింది. నిజానికి ఇస్లాం శాంతియుత మతం. విద్వేషం, హింస, పీడనలను ప్రబోధించలేదు. ఇస్లాంను ఈ చట్టం రక్షిస్తుంది. భారత్ లోకి వలసవచ్చిన శరణార్థుల్ని వెనక్కి పంపేందుకు ఈ చట్టంలో ఎలాంటి ఒప్పందం లేదు. ఎవరూ అపోహలకు గురికావొద్దు' అని సూచించింది. ఇక ముస్లిమేతర మైనారిటీలు 2014 డిసెంబరు 31లోగా మన దేశానికి వచ్చి ఉన్నట్లయితే వారికి మన పౌరసత్వం ఇచ్చే సీఏఏ-2019 చట్ట నిబంధనల్ని కేంద్రం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై హోం శాఖ క్లారిటీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Arvind Kejriwal: ఇదొక మురికి ఓటు బ్యాంకు రాజకీయం.. సీఏఏ పై కేజ్రివాల్!

ఎవరైనా పౌరసత్వం కోరవచ్చు..
అలాగే దేశంలోకి ‘అక్రమంగా వలసవచ్చిన వారిని పౌరసత్వ చట్టం-1955 మాదిరిగానే సీఏఏ కూడా ‘ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా భారత్‌లో అడుగుపెట్టిన విదేశీ’గానే గుర్తిస్తుందని తెలిపింది. ముస్లింలు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయకుండా ఈ చట్టం నిషేధించదని, ఏ దేశ ముస్లింలైనా పౌరసత్వ చట్టం సెక్షన్‌-6 కింద భారతీయ పౌరసత్వం కోరవచ్చని తెలిపింది. అది సహజసిద్ధమైన పౌరసత్వాన్ని పరిశీలిస్తుందని హోంశాఖ స్పష్టం చేసింది. ముస్లింలతోపాటు ఏ దేశానికి చెందిన ఇతర వ్యక్తులైనా ప్రస్తుత చట్టాల ప్రకారం భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని, భారత్‌ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ చట్టం అడ్డుకాదని తెలిపింది.

భారత పౌరసత్వం కోసం మూడు దేశాల శరణార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర సర్కారు కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. సీఏఏ-2019 కింద అర్హత కలిగిన వ్యక్తులెవరైనా ఈ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. iindiancitizenshiponline.nic.in

Advertisment
Advertisment
తాజా కథనాలు