గణేష్ నిమజ్జనం సందర్భంగా వాటర్, లస్సీ, కూల్ డ్రింక్స్ పంపిణీ చేసిన ముస్లీం సోదరులు.. హిందూ-ముస్లిం భాయి భాయి అనే నినాదంతో జమ్.. జమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2005 నుండి ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తన స్వంత ఖర్చుతో హిందూ ముస్లిం సోదర భావాన్ని పెంపొందించేందుకు, మానవత్వపు పునాదిగా అద్భుతమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. By Shiva.K 27 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ganesh Immersion in Karimnagar: మానవత్వమే అభిమతంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా.. మత సామరస్యానికి ప్రతీకగా, గంగా జమున తెహజీబ్ కు కేరాఫ్ కరీంనగర్ పట్టణం వేదికగా, హిందూ-ముస్లిం భాయి భాయి అనే నినాదంతో జమ్.. జమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2005 నుండి ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తన స్వంత ఖర్చుతో హిందూ ముస్లిం సోదర భావాన్ని పెంపొందించేందుకు, మానవత్వపు పునాదిగా అద్భుతమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా, నగరంలోని రాజీవ్ చౌక్ లో అతిపెద్ద స్టాల్ ను మంత్రి కమలాకర్ ప్రారంభించారు. బాదం మిల్క్ స్టాల్ ను సిపి సుబ్బారాయుడు, లస్సీ, బటర్ మిల్క్ స్టాల్ ను మేయర్ సునీల్ రావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ఉచిత పెద్ద స్టాల్ ను రాజీవ్ చౌక్ లో ఏర్పాటు చేసి సుమారు 30వేల ఉచిత మినరల్ వాటర్ బాటిల్స్, గులాబ్ వాటర్, లస్సీ.. బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ ను పంపిణీ చేస్తూ..దేశంలోనే గులాం అహ్మద్ ఆదర్శప్రాయుడన్నారు. దేశంలో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, కుల, మత, వర్గ, భేద వ్యవస్థను చూస్తే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే భిన్నంగా.. మత సామరస్యానికి ప్రతీకగా, గంగా జమున తెహజీబ్ కు కేరాఫ్ గా కరీంనగర్లో మాత్రం హిందూ-ముస్లిం అనే భేదభావం లేకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించే పద్ధతిలో భాగంగా మినరల్ వాటర్ ను, శీతల పానీయాలను గణేష్ నిమజ్ఞానికి వెళ్లే నగర హిందూ సోదరుల కోసం ప్రత్యేకంగా స్టాల్ ను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వినాయక నిమజ్జనం సందరరేగా త్రాగునీరు, శీతల పానీయాలు పంపిణీ చేయడం ఎంతో పుణ్యదాయకమని నిమజ్జనానికి వెళుతున్న భక్తులకు ఈ సౌకర్యాన్ని జమ్ జమ్ వెలేర్ సొసైటీ: ద్వారా స్టాల్ ఏర్పాటు చేసి సేవలందించడం మతసామరస్యానికి మారుపేరుగా నిలిచిందని కొనియాడారు. ఈకార్యక్రమంలో నగర ఏసీపీలు గోపతి నరేందర్, సర్వర్, విజయ్ కుమార్, శ్రీనివాస్, సిఐలు రవి కుమార్, రాంచంద్రరావు, ఎస్సై శ్రీనివాస్, ఎంఐఎం నాయకులు బర్కత్ అలీ, అలిబాబా, సాజిద్, అంజద్ ఖాన్, ఫర్హాజ్, యాఖుబ్ ఖాన్, షేఖ్ సమీ, అబ్దుల్లా ఆసీమ్, సయ్యద్ ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు. Also Read: Minister Harish Rao: త్వరలోనే తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కీలక వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు AP Assembly Updates: కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక బిల్లులకు ఆమోదం! Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా #telangana-news #karimnagar #karimnagar-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి