Ananthapuram: పుట్టపర్తిలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఆందోళన పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. By Jyoshna Sappogula 06 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Ananthapuram: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, సమానం వేతనంకు సమాన జీతం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అయితే, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. Also Read: ఏపీలో సర్పంచుల ఆందోళన.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు..అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం సిఐటియు మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గతంలో సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తే.. సమ్మె విరమిస్తే రెండు రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 30 రోజులు కావస్తున్నా అతీగతీ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: గుడిసెకు రూ. 62, 969 వేల కరెంట్ బిల్లు..ఉలిక్కిపడ్డ కుటుంబ సభ్యులు..! అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అయినా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకొస్తామని ఇక్కడికి వస్తే పోలీసులు చేత అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. #andhra-pradesh #muncipal-workers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి