IPL:10 వతరగతి పరీక్షల కోసం ఊరికి వెళ్తున్నా అంటున్న ముంబై ఆటగాడు ఇదేం రీజన్ రా బాబు అంటున్న నెటిజన్లు! ;చాలా మంది ఆటగాళ్లు గాయాల కారణంగా ఆయా టోర్నీలకు దూరం కావడం వింటుంటాం. కానీ, ఐపీఎల్లో ముంబయి బౌలర్ 10వ తరగతి పరీక్షలు రాయాలంటూ టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఈ కారణం నవ్వు తెప్పిస్తున్నా ఇది నిజమేనట! By Durga Rao 10 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ముంబయి ఇండియన్స్ యంగ్ బౌలర్ క్వేన మఫాకా 2024 ఐపీఎల్ టోర్నమెంట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి కారణం తెలుసుకుంటున్న క్రికెట్ ఫ్యాన్ మాత్రం నవ్వుకుంటున్నారు. ఇలా కూడా టోర్నీకి దూరమవుతారా? అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సౌతాఫ్రితాకు చెందిన మఫాకా 2024 ఐపీఎల్ టోర్నీ నుంచి మధ్యలోనే స్వదేశానికి వెళ్లనున్నాడట. మఫాకా త్వరలోనే 10వ తరగతి పరీక్షలు (10th Exams) రాయాల్సి ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజమని అంటున్నారు. 2006లో జన్మించిన మఫాకా రీసెంట్ (ఏప్రిల్ 08)గా 18 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ, సోషల్ మీడియాలో ఇదే ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్లో ఆడే ప్లేయర్ ఇంకా స్కూల్లో చదువుతున్నాడా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల జరిగిన అండర్- 19 వరల్డ్‌కప్‌లో మఫాకా అద్భుతంగా రాణించాడు. ఈ టోర్నీలో ఏకంగా 21 వికెట్లు నేల కూల్చి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. దీంతో దిల్షన్ మధుషంక స్థానంలో ముంబయి ఇండియన్స్ మఫాకాను జట్టులోకి తీసుకుంది. దీంతో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుల్లో ఒకడిగా మఫాకా రికార్డు కొట్టాడు. అయితే అరంగేట్ర మ్యాచ్‌లోనే మఫాకా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముంబయి- సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మఫాకా ఏకంగా వికెట్ లేకుండా 66 పరుగులు ఇచ్చి, చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. తర్వాత రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టినప్పటికీ 11.50 ఎకనమీతో 2 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చాడు. ఇక ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి బోణీ కొట్టింది. ఇప్పటివరకూ 4 మ్యాచ్‌లు ఆడిన ముంబయి ఒక మ్యాచ్‌లో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 234 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం దిల్లీని 205 పరుగులకే కట్టడి చేసి 2024 సీజన్లో గెలుపు రుచి చూసింది. #mumbai #ipl2024 #maphaka-u-19-world-cup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి