Telangana Elections: అర్థరాత్రి ధర్నాకు దిగిన సీతక్క.. కారణమిదేనట..

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క అర్థరాత్రి ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. బ్యాలెట్ పేపర్‌పై మిగతా అభ్యర్థుల కంటే తన ఫోటో చిన్నగా ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఫోటో మారుస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు.

New Update
Telangana Elections: అర్థరాత్రి ధర్నాకు దిగిన సీతక్క.. కారణమిదేనట..

MLA Seethakka Protest: కాంగ్రెస్ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క అర్థరాత్రి వేళ ధర్నాకు దిగారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ములుగు(Mulugu) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈవీఎం బ్యాలెట్ పేపర్‌పై(Ballot Paper) సీతక్క ఫోటో మిగతా అభ్యర్థులకంటే చిన్నగా వేశారు అధికారులు. దీనిని గమనించిన సీతక్క.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఈ అంశంపై అధికారులను ప్రశ్నించినా.. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అర్థరాత్రి 1 గంట దాటి తరువాత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నేతలతో కలిసి ఆఫీస్ ఎదుట బైఠాయించారు.

వెంటనే స్పందించిన ఎన్నికల అధికారులు.. పోలీసులు.. కార్యాలయం వద్దకు వచ్చారు. సీతక్కకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఫోటో మారిస్తే తప్ప తాను ఇక్కడి నుంచి కదలబోనని తేల్చి చెప్పారు సీతక్క. దీంతో మరో ఫోటో ఇస్తే మారుస్తామంటూ అధికారులు వివరించారు. ఆ వెంటనే కాంగ్రెస్ నాయకులు సీతక్కకు సంబంధించిన మరో ఫోటోను తీసుకువచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన ఫోటోను బ్యాలెట్‌పై ముద్రిస్తామని చెప్పిన అధికారులు.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, అధికారుల హామీలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ నాయకులు కాసేపు తమ నిరసనను కొనసాగించారు. అనంతరం పోలీసుల విజ్ఞప్తి మేరకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలాఉంటే.. సీతక్క ధర్నా గురించి తెలుసుకున్న రేవంత్ రెడ్డి.. అర్థరాత్రి సీతక్కు ఫోన్ చేశారు. ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు.

Also Read:

నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..

ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!

Advertisment
Advertisment
తాజా కథనాలు