AP: అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం.. సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు!

మాడుగుల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్.. సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. రాజారావు నుంచి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వరకు బెదిరించి, భయపెట్టే రాజకీయాలే చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దుచేస్తామన్నారు.

New Update
AP: అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం.. సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు!

CM Ramesh: మాడుగుల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. రాజారావు నుంచి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వరకు రాష్ట్రంలో ప్రజలను బెదిరించి, భయపెట్టే రాజకీయాలే చేస్తున్నారని ఆరోపించారు. అనకాపల్లి జిల్లా అభివృద్ధి ఉమ్మడి కూటమితోనే సాధ్యమని శనివారం నిర్వహించిన రోడ్ షోలో అన్నారు.

నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా..
ఈ మేరకు మాడుగుల నియోజకవర్గం మాడుగులలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణతో కలిసి మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాడుగుల నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఇక్కడ హాస్పిటల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ జరగాలంటే ఎంపీ అభ్యర్థిగా తనకు కమలం పువ్వుపై, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు సత్యనారాయణకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 13 వ తేదీన ఉదయం 6 గంటలకు ప్రజలందరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించి 10 గంటలకు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: AP News: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన తల్లి విజయమ్మ!

అలాగే రాజారావు రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 9 నెలలుగా అమలు చేస్తూ.. అక్రమ పాలన కొనసాగించాడని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పనికిమాలిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఈలాంటి యాక్ట్ చట్టాన్ని ను దేశంలో ఏ రాష్ట్రం కూడా ప్రవేశపెట్టలేదు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని సుప్రీం కోర్టు చట్టవ్యతిరేకమైన చట్టమని చీవాట్లు పెట్టింది. ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తుల హక్కులను కాపాడుతామన్నారు. మొదటి సంతకం దీనిపైనే చేస్తామన్నారు. జీవో డాక్యుమెంట్ చట్టవ్యతిరేకమైనదిగా చెబుతూ మీడియా ముఖంగా చింపివేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు