Bandi Sanjay : తెలంగాణలో కూటమిపై బండి హాట్ కామెంట్స్

TG: జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని అన్నారు. తెలంగాణలో పొత్తుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.కాగా నిన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉందని చెప్పిన విషయం తెలిసిందే.

New Update
Bandi Sanjay : తెలంగాణలో కూటమిపై బండి హాట్ కామెంట్స్

Telangana : కేంద్రమంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోనూ కూటమి కార్యాచరణ మొదలు పెడుతున్నట్లు సంకేతాలిచ్చారు. ఏపీలో బీజేపీ (BJP) తో జనసేన పొత్తు ఉందని అన్నారు బండి సంజయ్. తెలంగాణలోనూ జనసేన (Janasena) తో కలిసి పోరాడటంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అనంతరంపై రేవంత్‌పైనా బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపైనే దృష్టి పెట్టడం కరెక్ట్ కాదని హితవు పలికారు. పరిపాలనపై కూడా దృష్టి పెడితే బాగుంటుందని చురకలు అంటించారు. బీజేపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తామంటే మేము కూడా అలానే చేయాల్సి వస్తుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాగా నిన్న ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉందని చెప్పిన విషయం తెలిసిందే.

Also Read : ‘యానిమల్’ బ్యూటీ వేసుకున్న ఈ బ్లాక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే?

Advertisment
Advertisment
తాజా కథనాలు