Dasara Movies: దసరా సినిమాల 'రన్ టైమ్' లాక్

దసరా సినిమాల హంగామా మొదలైంది. మరో వీకెండ్ మధ్యలో ఉంటుండగానే, దసరా సినిమాలన్నీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరీ ముఖ్యంగా భగవంత్ కేసరి, 'టైగర్ నాగేశ్వరరావు' యూనిట్లు.. ఓ రేంజ్ లో తమ సినిమాల్ని ప్రసారం చేస్తున్నాయి. ఇంకోవైపు లియో మూవీ కూడా చాపకింద నీరులా చుట్టేస్తోంది. తాజాగా ఈ సినిమాల సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. రన్ టైమ్స్ లాక్ అయ్యాయి

New Update
Dasara Movies: దసరా సినిమాల 'రన్ టైమ్' లాక్

Dasara Movies: దసరా సినిమాల హంగామా మొదలైంది. మరో వీకెండ్ మధ్యలో ఉంటుండగానే, దసరా సినిమాలన్నీ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరీ ముఖ్యంగా భగవంత్ కేసరి, 'టైగర్ నాగేశ్వరరావు' యూనిట్లు.. ఓ రేంజ్ లో తమ సినిమాల్ని ప్రసారం చేస్తున్నాయి. ఇంకోవైపు లియో మూవీ కూడా చాపకింద నీరులా చుట్టేస్తోంది. తాజాగా ఈ సినిమాల సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. రన్ టైమ్స్ లాక్ అయ్యాయి.

దసరా బరిలో పెద్ద సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageswara Rao) ఈ సినిమా నిడివి అక్షరాలా 181 నిమిషాలుంది. అంటే సినిమా రన్ టైమ్ 3 గంటలన్నమాట. ఈమధ్య కాలంలో ఇలా భారీ రన్ టైమ్ తో సినిమాలు రావడం కామన్ అయిపోయింది. హిట్టయితే ఓకే, ఏమాత్రం రిజల్ట్ తేడా కొట్టినా ఆ తర్వాత నిడివి తగ్గించేస్తున్నారు.

రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' కు మాత్రం ఈమాత్రం డ్యూరేషన్ అవసరం అంటున్నారు మేకర్స్. సినిమా కథ చాలా పెద్దదని, చాలా ఘటనల్ని చర్చించాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే రన్ టైమ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదని చెబుతున్నాడు దర్శకుడు వంశీ. సినిమా నిడివి 3 గంటలు వస్తుందని తమకు ముందే తెలుసని, ఊహించినట్టుగానే 3 గంటలు లాక్ అయిందంటున్నాడు.

Also Read: ప్రభాస్ తీరుపై శ్యామలాదేవి ఆవేదన..కృష్ణంరాజు చివరి కోరిక తీర్చలేదంటూ..

అటు 'భగవంత్ కేసరి' (Bhagavanth kesari) మాత్రం పెర్ ఫెక్ట్ రన్ టైమ్ తో వస్తోంది. ఈ సినిమా నిడివి 155 నిమిషాలు. సాధారణంగా అనీల్ రావిపూడి, రన్ టైమ్ విషయంలో చాలా పక్కాగా ఉంటాడు. సినిమాను రెండున్నర గంటల్లోనే ముగించాలని చూస్తాడు. భగవంత్ కేసరి సినిమాకు కూడా అదే పని చేశాడు. బాలయ్య-కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బాలయ్య (Balakrishna) కూతురు వరుస పాత్రలో శ్రీలీల (Sreeleela) నటించింది. సినిమాలో బాలయ్య మార్క్ డైలాగ్స్, యాక్షన్ తో పాటు. రావిపూడి మార్క్ కామెడీ కూడా ఉందనే విషయం తాజాగా రిలీజైన ట్రయిలర్ తో అర్థమౌతోంది.

ఇక లియో (Leo Movie) సినిమా కూడా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ 164 నిమిషాలుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినిమా రన్ టైమ్ ను పట్టించుకోడు. మూవీ పెర్ ఫెక్ట్ గా ఉందా లేదా అని మాత్రమే చూస్తాడు. లియో మూవీకి కూడా అదే లాజిక్ ఫాలో అయ్యాడు. రెండున్నర గంటల కంటే ఎక్కువ సమయమే రన్ టైమ్ లాక్ అయినప్పటికీ, తగ్గించే ప్రయత్నం చేయలేదు. పైగా ఈ విషయంలో విజయ్ నిర్ణయం తీసుకుంటాడు. తన సినిమా ఫైనల్ వెర్షన్ పై విజయ్ దే తుది నిర్ణయం. అతడి అనుమతితోనే రెండున్నర గంటల కంటే కాస్త ఎక్కువ నిడివితో లియో సినిమాను విడుదల చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ రన్ టైమ్స్ తో వస్తున్న 3 దసరా సినిమాల్లో ఏది ప్రేక్షకుడ్ని ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు