This Week OTT Release: ఈ వారం ఓటీటీలో సూపర్ హిట్ చిత్రాలు.. అందరూ వెయిట్ చేస్తున్న ఆ సినిమా కూడా

ఈ వారం OTT లో అదిరిపోయే సినిమాలు రాబోతున్నాయి. యంగ్ హీరో తేజసజ్జ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్, సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలామ్, పొలిటికల్ డ్రామా యాత్ర 2, మిస్టరీ థ్రిల్లర్ అన్వేషిప్పిన్ కండెతుమ్ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి.

New Update
This Week OTT Release: ఈ వారం ఓటీటీలో సూపర్ హిట్ చిత్రాలు.. అందరూ వెయిట్ చేస్తున్న ఆ సినిమా కూడా

This Week OTT Releases: గత వారం ఈగల్, నా సామిరంగ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలతో పాటు పలు చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి. ఇక ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించడానికి అదిరిపోయే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..

హనుమాన్ (HanuMan)

యంగ్ హీరో తేజసజ్జ (Teja Sajja), ప్రశాంత్ వర్మ (Prashant Varma) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ హనుమాన్. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మార్చి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

This Week OTT Releases hanuman

లాల్ సలామ్

సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ రోల్ లో కనిపించిన చిత్రం 'లాల్ సలామ్'. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. థియేటర్ లో విడుదలైన నెల లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మార్చి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రామ్ – భీమ్.. ఇద్దర్నీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..?

publive-image

యాత్ర 2 (Yatra 2)

ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత.. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి సీఎం పదివిని ఎలా పొందాడు అనే నేపథ్యంలో తెరకెక్కిన సినిమా యాత్ర 2. 2019 లో వచ్చిన యాత్రకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పొలిటికల్ డ్రామా మార్చి 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానుంది.

This Week OTT Releases Yatra

బ్యాచిలర్ పార్టీ

అభిజిత్ మహేష్ డైరెక్ట్ చేసిన కన్నడ మూవీ బ్యాచిలర్ పార్టీ. ప్రముఖ కోలీవుడ్ నటుడు రక్షిత్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరిలో 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో మార్చి 4 నుంచి 'బ్యాచిలర్ పార్టీ' స్ట్రీమింగ్ కానుంది.

publive-image

ఓటీటీలోకి రాబోతున్న మరిన్ని చిత్రాలు

  • అన్వేషిప్పిన్ కండెతుమ్ ( మిస్టరీ థ్రిల్లర్)

మార్చి 8నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

  • లవర్ (తమిళ్ ఫిల్మ్ )

మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

  • మేరీ క్రిస్మస్ ( హిందీ ఫిల్మ్)

మార్చి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్

Manchu Manoj: “నీ హృదయంలో నాకు, ధైరవ్ కు చోటిచ్చినందుకు థ్యాంక్స్”.. భూమా మౌనిక ఎమోషనల్ పోస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు