OTT Release: మూవీ లవర్స్‌ని కిక్కెక్కించే సినిమాలు.. ఓటీటీలో కొత్త రిలీజ్‌లు ఇవే!

ఈ వారం మూవీ లవర్స్‌ని కిక్కెక్కించే సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవతున్నాయి. ఈ లిస్ట్‌లో పొలిమేర 2, జిగర్ తాండ, వధువు, ధక్ ధక్, కడక్ సింగ్, దీ ఆర్చీస్, మస్త్ మే రహ్నే లాంటి సినిమాలున్నాయి.

New Update
OTT Release: మూవీ లవర్స్‌ని కిక్కెక్కించే సినిమాలు.. ఓటీటీలో కొత్త రిలీజ్‌లు ఇవే!

OTT Release: రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలైన చిత్రాల హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న కొత్త సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లు కూడా ఈ వారం ఓటీటీ వేదికగా విడుదల కానున్నాయి. ఈ వారం ఓటీటీ రిలీజ్ కానున్న చిత్రాలేంటో చూసేయండి.

పొలిమేర 2 :  డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పొలిమేర 2. నవంబర్ 3 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం డిసెంబర్ 7 న ఓటీటీ వేదికైన ఆహాలో విడుదల కానుంది. ఈ సినిమాలో బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు.

publive-image

జిగర్ తాండ :  లారెన్స్ రాఘవ, ఎస్. జె సూర్య ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో విడుదలైన చిత్రం జిగర్ తాండా. నవంబర్ 10 న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైంది. డిసెంబర్ 8 న ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనుంది.

publive-image

వధువు:  డైరెక్టర్ పోలూరు కృష్ణ దర్శకత్వంలో అవికా గోర్, నందు, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సీరీస్ వధువు. 'వధువు' వెబ్ సీరీస్ డిసెంబర్ 8 న డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

publive-image

ధక్ ధక్: తరుణ్ దూదేజా దర్శకత్వంలో అజిత్ అంధారే, తాప్సీ పన్ను నిర్మించిన హిందీ డ్రామా ఫిలిం ధక్ ధక్. ఈ చిత్రంలో రత్న పాఠక్ షా, దియా మీర్జా, ఫాతిమా సనా షేక్, సంజన సంఘీ నటించారు. ఈ సినిమా డిసెంబర్ 8 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

publive-image

కడక్ సింగ్: అనిరుద్ధ రాయ్ చౌదరి దర్శకత్వంలో నవంబర్ 22 న విడుదలైన హిందీ చిత్రం కడక్ సింగ్. ఈ నెల డిసెంబర్ 8 జీ 5 లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ చిత్రంలో పార్వతి, పంకజ్ త్రిపాఠి నటించారు.

publive-image

దీ ఆర్చీస్: జోయా అక్తర్ దర్శకత్వంలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైన టీన్ మ్యూజికల్ కామెడీ చిత్రం చిత్రం దీ ఆర్చీస్. ఈ చిత్రంలో ఖుషీ కపూర్, సుహానా ఖాన్, వేదంగ్ రైనా, మిహిర్ అహుజా, అదితి నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 7 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

publive-image

మస్త్ మే రహ్నే: విజయ్ మౌర్య దర్శకత్వంలో విడుదలైన హిందీ చిత్రం మస్త్ మే రహ్నే. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 8న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వనుంది.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: “మంచి అనిపించుకోవడానికి డ్రామాలు అంతే”.. యావర్ పై అరిచేసిన అమర్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు