స్తంభించిన హాలీవుడ్, సమ్మెకు దిగిన యాక్టర్స్..! హాలీవుడ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాస్త ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నది. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, రెమ్యూనరేషన్లు పెంచాలని, ఏఐ నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించాలని డిమాండ్ చేస్తూ హాలీవుడ్‌కు చెందిన ‘ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్’సమ్మెకు దిగడంతో హాలీవుడ్ ఇండస్ట్రీ మూతపడింది. ఏం చేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఫిలీం ఛాంబర్స్ సభ్యులు చెబుతున్నారు. By Shareef Pasha 14 Jul 2023 in సినిమా ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి మూవీ నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో నిరవధిక సమ్మెకు గిల్డ్ పిలుపునిచ్చింది. దీంతో గత అర్ధరాత్రి నుంచి గిల్డ్‌లో ఉన్న లక్షా 60 వేల మంది నటీనటులు సమ్మెబాట పట్టారు. ఇవే డిమాండ్లతో గత 11 వారాలుగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగింది. తాజాగా వారికి నటీనటులు తోడవంతో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మూతపడినట్లయింది. ఇలా రచయితలు, నటులు ఒకేసారి సమ్మెకు దిగడం గత 63 ఏండ్లలో ఇదే తొలిసారి అని చెప్పాలి. హాలీవుడ్‌లో మొదటిసారిగా 1960లో నటుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలో రెండు యూనియన్లు డబుల్ స్ట్రైక్ చేశాయి. 1980లో స్క్రీన్ యాక్టర్స్ సమ్మె జరిగింది. ఇన్నేండ్ల తర్వాత రైటర్స్ గిల్డ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ కలిసి మరోసారి డబుల్ స్ట్రైక్ చేస్తున్నాయి. ఈసారి 98 శాతం మంది నటీనటులు ఈ సమ్మెకు మద్దతు తెలపడం విశేషం అనే చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో అన్ని ఇండస్ట్రీలకు ముప్పు తప్పదంటున్నారు. ఇది చూసిన సినీ ప్రియులు. ఈ సమ్మెతో హాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలు, టీవీ సిరీస్‌లు కాస్త మరింతగా ఆలస్యం కానున్నాయి. ఇదిలాగే కొనసాగితే భారీ సినిమాల రిలీజ్‌లు వాయిదా పడటం ఖాయం అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాల ప్రమోషన్లకు కూడా నటీనటులు దూరంగా ఉండనున్నారు. కాగా, ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమని, ఇప్పుడు కనుక తాము తమ గళం వినిపించకపోతే కష్టాల్లో పడతామని గిల్డ్ ప్రెసిడెంట్ ఫ్రాన్ డ్రెషర్ అన్నారు. అత్యాశకు పోతున్న స్టూడియోల వల్ల తాము బాధితులం అవుతున్నామని నటీనటులు వాపోతున్నారు. ఈ సమ్మె మూలంగా ఇండస్ట్రీకి ముప్పు తప్పుతుందో లేదో చూడాలి మరి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి