Crime News: ఖమ్మం జిల్లాలో విషాదం.. తల్లీ, కొడుకు మృతి..!

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చిమ్మపూడికి చెందిన తల్లీ, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనగర్ కాలనీలో ఓఇంట్లో చోరీ ఘటనలో కొడుకు శేషగిరిని పోలీసులు ఇటీవల విచారణకు పిలిచారు. దీంతో, తల్లి నర్సమ్మ, కొడుకు శేషగిరి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

New Update
TS News : అయ్యో వైశాలి.. మార్కులు తక్కువగా వచ్చాయని ఎంత పని చేశావమ్మా!

Khammam: తల్లీ, కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. రఘునాథపాలెం మండలం చిమ్మపూడికి చెందిన తల్లీ, కొడుకు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. గత ఆదివారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు కణతాల నర్సమ్మ, కణతాల శేషగిరి. గమనించిన స్థానికులు వెంటనే వారిద్దరిని చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Also read: రెండు లా కాలేజీలకు షాక్.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం..!

అయితే, నేడు ఉదయం చికిత్స పొందుతూ  నర్సమ్మ , శేషగిరి మృతి చెందారు. ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఓఇంట్లో చోరీ ఘటనలో శేషగిరిని ఇటీవల విచారణకు పోలీసులు పిలిచారు. మరుసటి రోజు విచారణకు రావాలని శేషగిరికి చెప్పారు. దీంతో శేషగిరి తల్లి నర్సమ్మను తీసుకుని ముదిగొండ బైక్ పై వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Also Read: తెరపైకి APSRTC లీజు వ్యవహారం.. ఆర్టీసీ ఆర్ఎంతో చర్చించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు.!

తల్లీ, కొడుకు ఆత్మసత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు చోరీ ఘటనలో విచారణకు రమ్మని పిలిచినందుకు అవమానంగా ఫీలై ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే సంగతి తెలియాల్సి ఉంది. తల్లీ, కొడుకు ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు