IPL Record Price: ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాళ్ల లిస్ట్ ఇదే..! ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు మిచెల్ స్టార్క్. ఐపీఎల్ మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. రూ. 20.50 కోట్లు చెల్లిస్తోంది. By Trinath 19 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఐపీఎల్ మినీ ఆక్షన్ (IPL mini Auction) మెగా ఆక్షన్‌ను మించిపోయింది. పర్సులో ఉన్న కొద్ది డబ్బులతోనే ఫ్రాంచైజీలు కోట్లకు కోట్లు కుమ్మరించారు. తమకు కావాల్సిన ఆటగాడి కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనకాడలేదు. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి మినీ ఆక్షన్‌లో రికార్డు ధరలు నమోదయ్యాయి. పాట్ కమ్మిన్స్‌ను సన్‌రైజర్స్ ఏకంగా రూ.20.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ షాక్ నుంచి తెరుకునే లోపే మరో ఆస్ట్రేలియా ప్లేయర్‌ను ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది కోల్‌కతా. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను భారీ ధరకు కేకేఆర్ దక్కించుకుంది. గతేడాది సామ్ కరన్‌ను పంజాబ్ రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా జరిగిన మినీ ఆక్షన్ ముందు వరకు ఇదే హయ్యస్ట్. అయితే తాజాగా మినీ ఆక్షన్‌లో సామ్ కరన్ రికార్డు బ్రేక్ అయ్యింది. సామ్ కర్రాన్-పంజాబ్ కింగ్స్- రూ18.50కోట్లు-2023 కామెరాన్ గ్రీన్-ముంబై ఇండియన్స్-రూ.17.50కోట్లు-2023 బెన్ స్టోక్స్-చెన్నై సూపర్ కింగ్స్-రూ.16.25కోట్లు-2023 క్రిస్ మోరిస్-రాజస్థాన్ రాయల్స్-రూ.16.25కోట్లు-2021 నికోలస్ పూరన్-లక్నో సూపర్ జెయింట్స్-రూ.16కోట్లు-2023 యువరాజ్ సింగ్-ఢిల్లీ డేర్ డెవిల్స్-రూ.16కోట్లు-2015 పాట్ కమిన్స్ -కోల్‌కతా నైట్ రైడర్స్-రూ.15.5కోట్లు-2020 ఇషాన్ కిషన్-ముంబై ఇండియన్స్-రూ.15.25కోట్లు-2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ కోసం దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా వేదికగా జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో పలు రికార్డులు బద్దలయ్యాయి. మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్‌తో సహా పలు విదేశీ ఆటగాళ్ళు ఫ్రాంచైజీల భారీ బిడ్‌లతో దక్కించుకున్నాయి. ఈ ఏడాది జరిగిన వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా కప్ గెలవడంతో స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. బంతిని అధిక వేగంతో స్వింగ్ చేయగలగడం స్టార్క్ సామర్థ్యం. స్టార్క్ చివరిసారిగా 2015లో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున తన ప్రారంభ సీజన్ ఆడాడు. ఆ సంవత్సరం 13 గేమ్‌లలో 20 వికెట్లు తీశాడు, సగటు 14.55, ఎకానమీ రేటు 6.76. Also Read: జాక్ పాట్ కొట్టిన వెస్టిండీస్ బౌలర్ .. రూ.11.5 కోట్లకు RCB సొంతం! #ipl-auction-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి